Begin typing your search above and press return to search.

అనుకోకుండా అన్ రౌండర్ అయ్యా: హార్ధిక్ పాండ్యా

By:  Tupaki Desk   |   10 Sep 2021 12:30 PM GMT
అనుకోకుండా అన్ రౌండర్ అయ్యా: హార్ధిక్ పాండ్యా
X
భారత జట్టులో అత్యుత్తమ ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది హార్ధిక్ పాండ్యా అని చెప్పొచ్చు. భారీ బ్యాటింగ్ తోపాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలగడం హార్ధిక్ పాండ్యా స్పెషాలిటీ. ఈ మధ్య ఫాం కోల్పోయాడు.. కానీ ఫామ్ లో ఉంటే హార్ధిక్ ను తట్టుకోవడం కష్టమే.

తాజాగా కపిల్ దేవ్ తో కలిసి హార్ధిక్ పాండ్యా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పాండ్యా బయటపెట్టాడు. ‘నాకు గతంలో ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి సరైన బూట్లు కూడా ఉండేవి కావు. నేను అనుకోకుండా ఆల్ రౌండర్ అయ్యాను’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆల్ రౌండర్ గా మారాను. టీమిండియాకు ఆడే ముందు ఒక సంవత్సరం మాత్రమే బౌలింగ్ చేశాను’ అని హార్ధిక్ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.

నేను మొదట బ్యాట్స్ మెన్ ను. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. మొదటిసారిగా అండర్ 19 మ్యాచుల్లో బౌలింగ్ చేశాను అని వివరించారు. ఈ మ్యాచ్ లే తనను ఆల్ రౌండర్ గా మార్చాయని.. ఇది తన అదృష్టమని హార్ధిక్ చెప్పుకొచ్చాడు.

ఒక రోజు కిరణ్ మోరే అకాడమీ తరుఫున ఒక మ్యాచ్ లో పాల్గొనన్నానని.. ఓ ఫాస్ట్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో అనూహ్యంగా నాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కిందని.. ఆ సమయంలో బూట్లు కూడా లేకపోతే వేరే వాళ్లవి వేసుకొని బౌలింగ్ చేశానని.. ఆ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టడమే తన కెరియర్ ను మలుపుతిప్పిందని హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ చూసిన శరత్ కుమార్ సార్.. రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశాడని.. హార్ధిక్ తెలిపాడు. అదే తన కెరీర్ ను మలుపుతిప్పిందని హార్ధిక్ తెలిపాడు. ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించి టీ20 వరల్డ్ కప్ లో హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు.