Begin typing your search above and press return to search.
నాపై వచ్చేవన్నీ అసత్య ప్రచారాలే.. టీమిండియా స్టార్ బౌలర్
By: Tupaki Desk | 16 May 2021 3:41 AM GMTభువనేశ్వర్ కుమార్... భారత బౌలింగ్ విభాగంలో కీలక సభ్యుడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా భువీకి పేరుంది. బౌలర్ గా ఆరంగేట్రంలో భువనేశ్వర్ అంత అద్భుతంగా ఏమీ రాణించలేదు. జట్టులో అవకాశాలు కూడా కోల్పోయాడు. కానీ వెంటనే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థులను తన బౌలింగ్ తో వణికించేవాడు. బుమ్రా కన్నా ముందే జట్టులోకి వచ్చిన భువీ టీమిండియా నంబర్ వన్ బౌలర్ గా ఎదుగుతాడని అంతా భావించారు.
అయితే తరచూ గాయాల బారిన పడటం అతడికి మైనస్ గా మారింది. మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ బౌలర్ గా ఎదుగుతాడని భావించిన భువనేశ్వర్ ఆశించినంతగా ఆడలేదు. ఒక వైపు బుమ్రా ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా ఎదిగినా భువీ మాత్రం ఆ స్థాయికి ఎదగలేక పోయాడు. అయితే అతడు తన ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం కావాలనే టెస్టులకు దూరంగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు భువనేశ్వర్ ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి భువనేశ్వర్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చెలరేగాయి.పరిమిత ఓవర్ల ఆటపై దృష్టి పెట్టేందు కోసమే అతడు టెస్టులకు దూరమయ్యాడని విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శలపై తాజాగా భువనేశ్వర్ స్పందించాడు. 'వన్ డే లు, టీ 20ల కోసమే నేను టెస్టులకు దూరం అవుతున్నా అని వస్తున్న రూమర్లలో నిజం లేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడటానికి నేనెప్పుడైనా సిద్ధమే. టెస్ట్ క్రికెట్ ఆడటమే నా మొదటి ప్రాధాన్యం. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడడం అంటే ఏ బౌలర్ కు అయినా ఇష్టమే. నేను కూడా అంతే. ఒక బౌలర్ సత్తా ఏమిటన్నది చాటేది టెస్టులే. నిజానిజాలు తెలుసుకోకుండా నాపై అనవసరంగా అసత్య ప్రచారాలు చేయొద్దని' భువీ ఈ సందర్భంగా కోరాడు. ఇటీవలి కాలంలో బుమ్రా, షమీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్ టెస్టుల్లో క్రమం తప్పకుండా ఆడుతూ రాణిస్తుండటంతో భువనేశ్వర్ సెలెక్టర్ల దృష్టిలో పడటం లేదు.