Begin typing your search above and press return to search.

ప్రపంచంలోని కరోనా కణాలన్ని ఒకే కోక్ డబ్బాలో సరిపోతాయట!

By:  Tupaki Desk   |   12 Feb 2021 1:30 AM GMT
ప్రపంచంలోని కరోనా కణాలన్ని ఒకే కోక్ డబ్బాలో సరిపోతాయట!
X
ప్రపంచంలోని కరోనా వైరస్ మహమ్మారి ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే .. ఆ కరోనా కణాలని కలిపి ఆ మొత్తాన్ని ఒకదగ్గరగా చేర్చి కలిపితే, సింగిల్ కోక్ డబ్బాలో సరిగ్గా సరిపోతుందంట, బ్రిటన్ గణిత శాస్త్రవేత్త ఒకరు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారికి కణాలన్నింటిని మొత్తం కలిపితే 160ml పరిమాణం కలిగిన కోక్ డబ్బాలో ఫిట్ అవుతుందని ఆయన అంచనా వేశారు.

యునైటెడ్ కింగ్‌ డమ్ ‌లోని బాత్ యూనివర్శిటీలో సీనియర్ లెక్చరర్ కిట్ యేట్స్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో సుమారు రెండు క్విన్టిలియన్ SARS-CoV-2 వైరస్ కణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక గ్రహం మీద ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా ఉంటుందని తేల్చేశారు. కానీ మొత్తం వాల్యూమ్‌ ను లెక్కించాల్సి వచ్చినప్పుడు, SARS-CoV-2 కణాలు చాలా చిన్నవగా ఉన్నాయని గణిత శాస్త్రవేత్త తెలిపారు.

ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ లేదా ఒక టీస్పూన్ పరిమాణంలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూగోళంలో వ్యాపించిన కరోనావైరస్ కణాలన్ని కలిపితే ఒక సింగిల్ డబ్బా కోక్ ఫిట్ అవుతుందని బ్రిటన్ గణిత శాస్త్రవేత్త తెలిపారు. SARS-CoV-2 కణాల వ్యాసాన్ని ఉపయోగించి అంచనా వేసినట్లు యేట్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదుకాగా , కరోనా వైరస్ బాధిత సమస్యలతో 2,359,000 మందికి పైగా మరణించారని నివేదిక వెల్లడించింది.