Begin typing your search above and press return to search.
టీడీపీలో 'యువగళం'పై ఆశలు నేతలు ఏం చేస్తారో...!
By: Tupaki Desk | 19 Jan 2023 5:30 PM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ నెల 27న యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తంగా 4 వేల కిలోమీటర్లు 4 వందల రోజుల పాటు సాగే ఈ యాత్రకు మంచి హైప్ తీసుకురావాలనేది పార్టీ వర్గాల అభిప్రా యం. ఈ క్రమంలోనే సుమారు 50 ఆన్‌లైన్ చానెళ్లు.. మరికొన్ని రెగ్యులర్ చానెళ్లు సహా.. ఇతర మీడియా సంస్థలతోనూ పార్టీ ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. అంటే.. మొత్తంగా పార్టీ ఈ యాత్రపై చాలానే ఆశలు పెట్టుకుంది.
పార్టీ అధినేత చంద్రబాబుమౌనంగా ఉన్నప్పటికీ.. నారా లోకేష్ మాత్రం తన యాత్ర ద్వారా ప్రజల ఆలోచనా సరళిని మారుస్తాన ని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తన యాత్ర ద్వారా ఎండగడతానని కూడా ఆయన అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అసలు సమస్య.. నాయకుల మధ్యే కనిపిస్తోం ది. యువగళం ప్రకటించిన తర్వాత.. తొలి రోజు ప్లాన్ విడుదల చేసిన తర్వాత కూడా .. అనుకున్న రేంజ్‌లో పార్టీ ఊపు రాలేదనే ది పార్టీ నేతల గుసగుస!.
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని చెబుతున్నారు. ఎందుకంటే.. ఎప్పుడూ మాట్లాడే యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు ఇలా.. కొందరు మాత్రమే ఇప్పటి వరకు బయటకు వచ్చారు యాత్రకు మద్దతు పలికారు. అయితే.. వాస్తవానికి వీరు పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ.. పార్టీతోనే ఉంటారు. పార్టీలోనే ఉంటారు. సో.. వీరిని పక్కన పెడితే.. పార్టీకి ఒనగూరే వేరే ప్రయోజనం.. వేరే నాయకులు.. వేరేగా ఉన్నాయి. వారు స్పందించాల్సిన అవసరం ఉంది.
అయితే..ఈ ఈక్వేషన్లు చూసుకుంటే.. అనుకున్న విధంగా యువగళం గురించిన చర్చ పార్టీ నేతల మధ్య రావడం లేదు. నిజానికి ఇప్పటికే యువగళానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి. తాము కూడా రెడీ అంటూ.. ఉవ్వెత్తున జిల్లాల్లో నాయకులు ముందుకు కదలాలి.
కానీ, ఆ తరహా పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. దానికి సమాంతరంగా అనేక మంది నాయకులు పాదయాత్ర చేశారు. దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆశించారు. కానీ, ఇప్పటి వరకు ఆ ఊసు లేకపోవడమే.. చర్చకు దారితీస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.