Begin typing your search above and press return to search.

‘వీధి పోటు’ అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి...!

By:  Tupaki Desk   |   3 March 2021 11:30 PM GMT
‘వీధి పోటు’ అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి...!
X
మన ఇంటికి ఎదురుగా నిలువైన వీధి ఉంటే దాన్ని వీధి పోటు అంటారు. ఈ వీధి పోటుతో అనేక నష్టాలు, అరిష్ఠాలు వాటిల్లుతాయని వాస్తు నిపుణలు అంటున్నారు. కొత్తగా ఇల్లు కొట్టుకొవాలనుకొనేవాళ్లు కచ్చితంగా వీధి పోటు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. సరైన స్థలం ఎన్నుకొని ఇల్లు కట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఏయే వీధిపోటుతో ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.. తూర్పు వైపున వీధిపోటు ఉంటే ప్రభుత్వంతో భయం కలుగుతుంది. ఆగ్నేయ వీధిపోటు ఉంటే కష్టాలు వస్తాయి.. ఇంట్లో డబ్బు నిలవదు.. రోగాలు పట్టి పీడిస్తాయి.

పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటే.. ఆ ఇంట్లో నివసించే మగవాళ్ల మీద ప్రభావం ఉంటుంది. ఉద్యోగులైతే ప్రమోషన్లు రావు, రాజకీయ నాయకులైతే పదవులు రావు.. ఎంత నైపుణ్యం ఉన్నా తగిన గుర్తింపు దక్కదు. నైరుతి వీధిపోటు ఉంటే.. ఇంట్లోవాళ్లు డిప్రెషన్​కు లోనవుతారు. అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి. చేతిలో ఉన్న డబ్బంతా అనవసరంగా ఖర్చవుతుంటుంది. ఏ పని ప్రారంభించినా ముందుకు సాగదు. ఉత్తర వాయవ్యంలో వీధిపోటు ఇంట్లోని స్త్రీలకు చెడు ప్రభావం చూపిస్తుంది. గృహిణులకు తరుచూ వ్యాధులు వస్తుంటాయి. యువతులకు పెళ్లిల్లు కుదరవు, ఉద్యోగాలు కూడా తొందరగా రావు.

ఆగ్నేయం వీధిపోటుతో అగ్నిభయం ఎక్కువగా ఉంటుంది. దక్షిణం వీధిపోటు ఇది చాలా డేంజర్​. దీంతో ఇంట్లో నివసించే వాళ్లకు ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణ నైరుతి వీధిపోటు ఈ ఇంట్లో ఉన్న భార్యభర్తలకు సఖ్యత ఉండదు. ఎప్పుడూ కలహాల కాపురమే కొనసాగుతూ ఉంటుంది. అయితే స్థలం కొనేముందే దానికి వీధిపోటు ఉందా? లేదా? అనేది చూసుకోవాలి? ఒకవేళ మీరు పొరపాటున కొని ఉంటే మాత్రం ఆ స్థలాన్ని వదిలిపెట్టడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో వాస్తు పండితులను సంప్రదించి దోష నివారణ చేసుకోవాలి.