Begin typing your search above and press return to search.
కడక్‌నాథ్ కోడి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
By: Tupaki Desk | 4 March 2021 1:30 AM GMTకోడిమాంసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ! అంటే ఇక్కడ నాన్ వేజ్ ప్రియుల గురించి మాట్లాడుతున్నాం.. కోడి కూర, వేపుడు, పులుసు, ఫ్రై, చికెన్ టిక్కా ఏ వెరైటీ అయినా తీసుకోండి కోడి కూర కు ఉన్న డిమాండ్ వేరు. ఇదిలా ఉంటే ఇటీవల కడక్ నాథ్ కోడి కి విపరీతం గా డిమాండ్ పెరిగింది. గతంలో చాలా మంది బాయిలర్ చికెన్ కు బదులుగా నాటు కోడి తినే వాళ్లు.. అయితే ఇప్పుడు మాత్రం కడక్ నాథ్ కోళ్ల ను తింటున్నారు.
కడక్ నాథ్ చికెన్ ధర కిలో రూ. 1000 నుంచి 1200 ఉంటుంది. అయినప్పటికీ ఈ కోడి అంటే ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చికెన్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కడక్ నాథ్ కోడి మాంసం చూడటానికి నల్ల గా ఉంటుంది. కోడి కూడా ఇదే రంగు లో ఉంటుంది.
అయితే కడక్‌నాథ్ కోడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకు కారణం ఇందులో కొవ్వు తక్కువ గా ఉండటమే. దీంతో షుగర్పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ఈ మాంసాన్ని ఇష్టపడుతున్నారు. వెరసి ధర పెరిగింది. ఈ కడక్‌నాథ్ కోడి ఎక్కువగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్ ల లోని గిరిజన ప్రాంతాల్లో పెరిగేవి. ప్రస్తుతం దీని డిమాండ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కోళ్ల ను పెంచుతున్నారు. టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్ నాథ్ కోళ్లు బిజినెస్ పెట్టారు. దీంతో ఈ కోళ్ల కు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కడక్ నాథ్ కోళ్లు బాగానే అమ్ముడవుతున్నాయి.
పలు రెస్టారెంట్లలో కూడా ఈ మాంసం దొరుకుతుంది. రుచితో పాటు శరీరానికి కూడా ఎంతో మంచిది కాబట్టి కడక్‌నాథ్ కోడిని తింటున్నామని హైదరాబాదీలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కడక్‌నాథ్ కోడి అమ్ముడవుతున్నది.