Begin typing your search above and press return to search.
ధోనీ కడక్ నాథ్ కోళ్ల బిజినెస్... తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ , కేజీ ధర ఎంతంటే..?
By: Tupaki Desk | 4 March 2021 11:30 PM GMTకడక్ నాథ్ కోడి .. అసలు చూడ్డానికే ఈ కోడి గ్లామరస్ గా వుంటుంది. నల్లని రూపం, హొయలు పోయే నడక. ధోనీ ఈ కోళ్లు చూసి ముచ్చటపడి ఓ ఫామ్ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరి చూపూ ఈ కోళ్లపై పడింది. బ్లాక్ చికెన్ లేదా కడక్ నాథ్ కోడి మాంసం రేటు కిలో వెయ్యి నుంచి 12వందల వరకు ఉంది. కడక్ నాథ్ కోళ్ల గుడ్డు రేటు ఒక్కొక్కటీ 50 రూపాయిలు. తింటే దాని టేస్టే వేరు. కడక్‌నాథ్ కోడి మాంసం కూడా కోడిలానే నల్లటి రంగులోనే ఉంటుంది. కడక్ నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉండటమే దీని స్పెషల్. మంచి రుచి.. దానికితోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్ నాథ్ చికెన్ ధర కొండెక్కింది. రేటు ఎంతైనా కూడా దాన్ని తినే వారి సంఖ్య మాత్రం రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.
నాటుకోడి మాంసం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నోరూరని వారుండరు. అందుకే నాటు కోడి చికెన్ ఎప్పుడూ మార్కెట్లో హాట్ హాట్ గా అమ్ముడయిపోతుంటుంది. ఐతే,ఇప్పుడు ఈ నాటు కోడికి ఢీ కొట్టడానికి మరో స్పెషల్ కోడి రంగంలో దిగింది. సంక్రాంతి బరిలో కోడి పుంజులా మార్కెట్లో నాటుకోడితో పోటీపడుతోంది కడక్‌నాథ్ కోడి. సాధారణంగా కడక్ నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ వాస్తవానికి అవి కాస్త కాఫీరంగుతో పాటు కొంత పింక్ కలర్ లో ఉంటాయి. కడక్ నాథ్ కోళ్లను మాంసం కోసం గుడ్లు కోసం పెంచుతారు. టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లు బిజినెస్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాక కడక్ నాథ్ చికెన్‌కు బాగా ప్రాచూర్యం లభించింది. వాటి గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేయడంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి.