Begin typing your search above and press return to search.

అవమానాలను ఓడించింది.. ‘మిస్ ట్రాన్స్ క్వీన్’గా షైనీ సోని!

By:  Tupaki Desk   |   23 Dec 2020 8:41 AM IST
అవమానాలను ఓడించింది.. ‘మిస్ ట్రాన్స్ క్వీన్’గా షైనీ సోని!
X
ట్రాన్స్​జెండర్​.. ఈ పేరుచెబితేనే సమాజంలో ఓ చిన్నచూపు.. కేవలం చిన్నచూపు మాత్రమే కాదు ఏవగింపు, అసహ్యభావన. ట్రాన్స్​జెండర్ గా పుట్టడం వాళ్ల చేతుల్లో ఉండదు. అది సహజసిద్ధంగా జరిగే ఓ పరిణామం. ట్రాన్స్​జెండర్ల ఉనికిని వాళ్ల హక్కులను భారతీయ సమాజం కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నది. కొన్ని చోట్ల ట్రాన్స్​జెండర్లు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. తాజాగా మిస్​ట్రాన్స్​క్వీన్​ పోటీల్లో షైనీ సోని పాల్గొని ‘మిస్ ట్రాన్స్ క్వీన్‌ ఇండియా 2020'గా నిలించింది.

మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా‌ పోటీలను 2017లో తొలిసారిగా నిర్వహించారు. అప్పటినుంచి ఈ పోటీలను కొనసాగిస్తున్నారు. మిస్​ఇండియా పోటీలకు దీటుగా మిస్​ ట్రాన్స్​క్వీన్​ పోటీలు జరుగుతుంటాయి. ఫోటోషూట్స్​, ట్యాలెంట్​ రౌండ్స్​ ఇక్కడ కూడా ఉంటాయి. కరోనాతో ఈ సారి పోటీలకు తొలుత కొన్ని ఆటంకాలు ఏర్పడ్డా.. చివరకు పోటీలు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో షైనీ సోని విజయం సాధించారు. ఆమె త్వరలోనే ‘మిస్​ ఇంటర్నేషనల్​ క్వీన్​’లో పాల్గొననున్నారు.

షైనీ సో జీవితం ఎంతో భయానకంగా గడిచింది. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు, బంధువులతోనే ఆమె చీత్కారాలు ఎదుర్కొన్నది. షైనీ సో మగపిల్లాడిలా జన్మించింది. కానీ ఆమె మెదడు.. లక్షణాలు మాత్రం ఆడపిల్లలా ఉండేవి. దీంతో తోటిపిల్లలు గేలిచేసేవారు. తల్లిదండ్రులు కూడా షైనిని నిందించేవారు. చివరకు 17 వ ఏట ఇంటి నుంచి బయటకొచ్చిన షైనీ
హార్మోనల్ థెరపీ చేయుంచుకున్నది.

ఎల్జీబీటీ హక్కుల గురించి తెలుసుకుంది. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ కమ్యూనిటీలతో కనెక్ట్ అయ్యింది. కమ్యూనిటీ సహకారంతో తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ విద్యను అభ్యసించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మరికొన్ని సర్జరీలు చేయించుకొని పూర్తి స్త్రీగా మారిపోయింది. మిస్​ట్రాన్స్​క్వీన్​ ఇండియాగా అవతరించిన షైనీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఈ పోటీలు అందాల ప్రదర్శనలు మాత్రమే కావు. ట్రాన్స్​జెండర్లు హక్కులు, సాధికారితకు ప్రతీకలు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.