Begin typing your search above and press return to search.
రాజధానిపై మబ్బులు వీడాయి: క్లారిటీ ఇచ్చిన ఆళ్ళ
By: Tupaki Desk | 30 Aug 2019 7:24 AM GMTగత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందటే అది రాజధాని అమరావతి మార్పు గురించే. కృష్ణా నదికి వరదల వచ్చిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలు రాజధాని మార్పుపై ప్రజల్లో అనుమానాలు చెలరేగాయి. దీనికి తోడు ప్రతిపక్షాలు రోజుకో మాట మాట్లాడుతుండటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఇక బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక అడుగు ముందుకేసి ఏపీకి నాలుగు రాజధానులు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
దీంతో కొన్ని రోజుల నుంచి రాజధానిపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు. పనులు మొదలు కానీ, బ్యాంకులతో ఒప్పందంలేని కాంట్రాక్టుల్ని రద్దు చేశామని - నిధుల లభ్యతను బట్టి పనుల విషయంలో ముందుకెళతామని చెప్పారు. ఈ ప్రకటనతో రాజధాని అమరావతే అని తేలిపోయింది.
అయితే రాజధాని మార్పుపై సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ బొత్స వ్యాఖ్యలని అడ్డం పెట్టుకుని విపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. కాకపోతే ఇలా అనుమానాలు ఉన్నప్పుడే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి క్లారీటీ ఇచ్చారు. రాజధాని అనేది ఇక్కడినుంచి తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు? అని మీడియా ద్వారా విపక్షాలని ప్రశ్నించారు. పైగా ప్రధానమైన రాజధాని భవనాలకు సరిపడా ప్రభుత్వ భూములు మంగళగిరి ప్రాంతంలోనే ఉన్నాయని కూడా అప్పుడే చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఈయన మాటలు పట్టించుకోకుండా బొత్స మాటలపై హడావిడి చేశాయి.
ఇక ఇప్పుడు సీఆర్డీయే సమావేశం తర్వాత బొత్స అధికారికంగా తరలింపు లేదనే సంగతిని తేల్చేశారు. ఈ విషయం గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజధాని ఇక్కడ ఉంటున్నది కాబట్టే, తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి సొంత ఇల్లు కట్టుకున్నారని - పార్టీ ఆఫీసు కట్టమని చెప్పి మరింత క్లారీటీ ఇచ్చారు. మొత్తానికి రాజధానిపై బొత్స అధికార ప్రకటనపై ఆళ్ళ మరింత క్లారీటీ ఇచ్చి అమరావతి మార్పుపై మబ్బులు విడిపోయేలా చేశారు.