Begin typing your search above and press return to search.

బాబూ... ఆర్కే స‌వాల్‌ కు సిద్ధ‌మేనా?

By:  Tupaki Desk   |   21 Sep 2017 10:46 AM GMT
బాబూ... ఆర్కే స‌వాల్‌ కు సిద్ధ‌మేనా?
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీని - ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వహారం ఇప్పుడ‌ప్పుడే స‌ద్దుమ‌ణిగేలా లేదు. వేలాది కోట్ల రూపాయ‌ల విలువ చేసే ఈ భూముల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా వేలం వేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... త‌న పార్టీకి చెందిన ఓ వ్య‌క్తికి కేవ‌లం రూ.22 కోట్ల‌కు క‌ట్ట‌బెట్టింది. అయితే ప్ర‌భుత్వ ద‌మ‌న‌నీతిని ప్ర‌శ్నించిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి... ఏకంగా న్యాయ‌పోరాటం చేసీ మరీ ఈ భూముల‌కు మ‌రోమారు వేలం జ‌రిగేలా చేశారు. కోర్టు ఆదేశాల‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేసేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు య‌త్నించినా... ఆళ్ల ముందు మాత్రం ఆ కుటిల య‌త్నాలేనీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌లే ఈ భూముల‌కు జ‌రిగిన వేలంలో తొలుత వ‌చ్చిన ధ‌ర కంటే దాదాపుగా మూడు రెట్లు పెరిగి రూ.60 కోట్ల మేర వ‌చ్చింది. అంటే స‌దావ‌ర్తి స‌త్రం భూముల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు కారు చౌక‌గా అమ్మేసింద‌ని ఆరోప‌ణ‌లు చేసిన ఆళ్ల వాద‌న‌లో నిజ‌ముంద‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలో ఈ విష‌యంలో ఆళ్ల‌నే త‌ప్పుబ‌డుతూ బాబు అండ్ కో ఓ రేంజిలో ఎదురు దాడి మొద‌లెట్టింది. ఈ దాడిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టిన ఆళ్ల‌... అస‌లు త‌ప్పంతా చంద్ర‌బాబు స‌ర్కారుదేన‌ని తేలిపోయినా... ఈ కొత్త వాద‌న‌లు - ప‌స లేని వాద‌న‌లు ఎందుకంటూ ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే... అస‌లు బాబు స‌ర్కారుకు ద‌మ్ముంటే.. స‌దావ‌ర్తి స‌త్రం భూముల‌కు సంబంధించిన మొత్తం వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశాయ‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. కాసేపటి క్రితం హైద‌రాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బాబు స‌ర్కారుకు ఈ మేర‌కు స‌వాల్ విసిరారు.

ఈ సంద‌ర్భంగా ఆళ్ల ఏం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... * పేద బ్రాహ్మణుల వేద విద్య కోసం సదావర్తి భూములను రాజా వాసిరెడ్డి వారసులు రాసిచ్చారు. అవి బ్రాహ్మణ భూములే. ప్రభుత్వ భూములు ఎంత‌మాత్రం కావు. పేద బ్రాహ్మణుల ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్‌ దక్కించుకున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించడంతో ఇప్పుడు వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు మాపై నిందలు వేస్తున్నారు. సదావర్తి భూములను కాపాడేందుకే తాము కోర్టును ఆశ్రయించాం. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వేలం పాట నిర్వహించింది. అయితే రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ చార్జ్ - మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించని విషయం తెలిసిందే. అంతేకాకుండా కేసులు - పిటిషన్ లు అంటూ వైసీపీ బెదిరిస్తోందంటూ శ్రీనివాసులురెడ్డితో ముఖ్యమంత్రి... పత్రికాముఖంగా అబద్ధాలు చెప్పించారు. వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించాం. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయా శాఖ కమిషనర్‌ చెప్పే మాటలకు పొంతన లేదు. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలన్నది చంద్రబాబు ప్లాన్* అని ఆర్కే నిప్పులు చెరిగారు.