Begin typing your search above and press return to search.
మంగళగిరి.. ఇది లోకేష్ సామ్రాజ్యం..
By: Tupaki Desk | 1 April 2019 7:01 AM GMTమంగళగిరి.. ఏపీ సీఎం కుమారుడు - మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై ఇప్పుడు అధికార టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. గెలవడానికి సామ ధాన - బేధ దండోపాయాలను ప్రయోగిస్తోంది. నియోజకవర్గంలో ఈగ వాలినా అది లోకేష్ పర్మిషన్ తీసుకోవాలనేంతగా పరిస్థితి మారిపోయిందట.. పోలీసులు కూడా జీహుజూర్ అంటూ టీడీపీ నేతలకు కాపుకాయడం విమర్శలకు కారణమవుతోంది.
తాజాగా మంగళగిరికి హైదరాబాద్ నుంచి కొందరు ఐటీ ఉద్యోగులు తమ బంధువు కంటి ఆపరేషన్ చేయించుకుంటే పరామర్శకు వచ్చాడు. స్థానిక మిత్రులతో కలిసి రెండు కార్లలో వారి ఇంటికి వెళ్లారు. వీళ్లపై అనుమానం వచ్చిన కొందరు టీడీపీ నేతలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి బంధువు ఇంటికి వీరు రావడంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి జీహుజూర్ అంటూ పోలీసులు స్పందించారు. ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు.
ఇక ఐటీ ఉద్యోగుల తరుఫున న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని అన్యాయంగా విచారణకు తీసుకోవడంపై ప్రశ్నించేసరికి పోలీసులు భయపడి వదిలేశారు. ఇలా డబ్బులు పంచడానికి వచ్చారంటూ టీడీపీ నేతల అత్యుత్సాహం.. పరామర్శకు వచ్చిన ఐటీ ఉద్యోగుల పాలిట పెనుశాపమైంది.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీరుపై నిప్పులు కురిపించారు. మంగళగిరిలో సీఎం కొడుకు పోటీచేస్తున్నంత మాత్రానా ఇది సామాంత రాజ్యమా.? ఇక్కడికి రాకూడదా అని వారు ప్రశ్నించారు. ఇక్కడ టీడీపీ గెలిస్తే ప్రత్యర్థి పార్టీలు, జైకొట్టని ప్రజలు బతుకుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మంగళగిరిలో గెలవడానికి టీడీపీ చేస్తున్న పనులు విమర్శలకు కారణమవుతున్నాయి.