Begin typing your search above and press return to search.

ఆళ్లకు అదిరే పదవి...సీఆర్డీఏ చైర్మన్ గా నియామకం

By:  Tupaki Desk   |   13 Jun 2019 5:38 PM GMT
ఆళ్లకు అదిరే పదవి...సీఆర్డీఏ చైర్మన్ గా నియామకం
X
వైసీపీలో కీలక నేత, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిజంగానే బంపర్ ఆపర్ తలిగిందనే చెప్పాలి. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమనుకున్నా... సామాజిక సమీకరణాలతో ఆళ్లకు అవకాశం దక్కలేదు. అయితే పదవులపై పెద్దగా ఆశ పెట్టుకోని ఆళ్ల... ఎప్పటిలానే తనదైన శైలి వైఖరితో దూసుకెళుతున్నారు. తాజా ఎన్నికల్లో రాజధానిని ఉద్దరిస్తామని, తననే గెలిపించాలని మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాల లోకేశ్ ను చిత్తుగా ఓడించిన ఆళ్ల... మంగళగిరిలో తనకు ఎంత పట్టుందో ఇట్టే చెప్పేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరికి వచ్చిన జగన్... ఆళ్లను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని కూడా ప్రకటన చేశారు. నారా లోకేశ్ తో ఆళ్ల పోటీ హైటెన్షన్ వాతారణంలో జరిగినా... లోకేశ్ ను ఆళ్ల చిత్తుగా ఓడించారు. అయితే జగన్ తన మంత్రివర్గంలో ఆళ్లకు చోటు కల్పించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆళ్లకు కేబినెట్ బెర్తు దక్కలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఆళ్లకు పార్టీలో ఉన్న ప్రాధాన్యత, ప్రజల కోసం పార్టీ తరఫున ఆళ్ల సాగించిన పోరును ఎంతమాత్రం మరిచిపోని జగన్.. ఆళ్లకు అదిరేటి పదవి ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటు చేసిన సీఆర్డీఏకు చైర్మన్ గా ఆళ్లను నియమించాలని జగన్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పేరిట చంద్రబాబు సర్కారు చేపట్టిన భూ సేకరణకు వ్యతిరేకంగా ఆళ్ల చేసిన పోరాటం ఏ ఒక్కరూ మచిరిపోలేనిదే. భూసేకరణలో చంద్రబాబు సర్కారు అవలంబించిన విధానాలను ఆళ్ల తనదూన శైలిలో తూర్పారబట్టారు. ఈ క్రమంలోనే ఆళ్లకు మంచి పేరు కూడా వచ్చింది. రాజధాని భూములపై తనదైన పోరు సాగించిన ఆళ్లకు రాజధాని ప్రాంతంపై సమగ్ర పట్టు ఉంది. అలాంటి ఆళ్లకు సీఆర్డీఏ చైర్మన్ పదవి కట్టబెడుతున్న తీరుపై ఇప్పటికే జగన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్డీఏ చైర్మన్ గా ఆళ్లను జగన్ ఎంపిక చేయడంతో ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్ననాయి.