Begin typing your search above and press return to search.
సదావర్తిలో షాకిచ్చేందుకు 10 కోట్లతో ఆళ్ల రెడీ
By: Tupaki Desk | 11 July 2017 10:32 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేరుగా షాక్ తగిలిన ఉదంతం ఈ మధ్యన ఏదైనా ఉందంటే అది సదావర్తి భూముల వ్యవహారమేనని చెప్పక తప్పదు. అయిన వాళ్లకు కారుచౌకగా వందలాది కోట్ల రూపాయిల భూముల్ని కట్టబెట్టేందుకు గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అధికారపక్షానికి షాకిచ్చేలా ఈ ఇష్యూ కోర్టుకు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఈ భూములకు వేలంలో పలికిన ధర కంటే రూ.5 కోట్లు అదనంగా ఇచ్చేందుకు తాను సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు చెప్పటం సంచలనంగా మారింది.
ఇంతకీ సదావర్తి భూముల ముచ్చటను సింపుల్ గా చెప్పాల్సి వస్తే.. గుంటూరుజిల్లా అమరావతిలో ఉన్న సదావర్తి సత్రానికి తమిళనాడులో 83 ఎకరాల భూమి ఉంది. వందలాది కోట్లు విలువైన ఈ భూముల్ని 2016 మార్చి 28న ఏపీ సర్కారు నామమాత్రపు మొత్తమైన రూ.22.44కోట్లకు విక్రయించిందంటూ జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వేలంలో అమ్మిన మొత్తం కంటే రూ.10 కోట్లు అదనంగా చెల్లించటానికి తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల కోర్టుకు చెప్పిన సమాధానం ఏపీ అధికార పక్షానికి మింగుడుపడని రీతిలో ఉందన్న మాట వినిపిస్తోంది. తొలి విడతగా రూ.10 కోట్లు చెల్లించేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉన్నట్లు ఆళ్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదిలాఉంటే.. ఆళ్ల చెల్లిస్తానని చెప్పిన తొలి విడత మొత్తాన్ని దేవాదాయ శాఖకు ఇవ్వాలని.. డబ్బు చెల్లించినట్లుగా ఆ శాఖ కమిషనర్ నుంచి రసీదు తీసుకోవాలని.. దాన్ని తమకు ఇవ్వాలని కోర్టు సూచించింది. రెండు వారాల్లో రూ.10కోట్లు చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఏపీ సర్కారుకు ఎంతమాత్రం మింగుడుపడని రీతిలో మారిందని చెప్పక తప్పదు.