Begin typing your search above and press return to search.

సీఐడీ ద‌ర్యాప్తుపై ఎమ్మెల్యే సెటైర్ ఇది

By:  Tupaki Desk   |   7 Jun 2017 2:58 PM GMT
సీఐడీ ద‌ర్యాప్తుపై ఎమ్మెల్యే సెటైర్ ఇది
X
ఏపీలో జ‌రిగిన చిత్ర‌మైన ప‌రిణామాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. చిన్న‌పాటి వ‌ర్షానికే ఏపీ స‌చివాల‌యంలో గోడ మొత్తం చిల్లులు ప‌డి అక్క‌డంతా నీటిమ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో అక్క‌డి వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నించేందుకు వైసీపీ ఎమ్మెల్యేల బృందం సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా వారిని స్థానికంగా ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. అసెంబ్లీలోకి అనుమ‌తించ‌ని నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పైపును ఎవరో కోయడం వలన అసెంబ్లీలోకి నీరు వచ్చాయి కాబట్టి దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదమ‌ని ఆర్కే ఎద్దేవా చేశారు. మమ్మల్ని, మీడియానే లోపలకు వెళ్లనీయడంలేదని ఎవరో అప‌రిచితుల‌ను లోపలకు ఎలా పంపుతారని ఆర్కే ప్ర‌శ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లను తెచ్చుకుని చెక్ చేస్తే ఎవరు పైపులను కోశారో తెలుస్తుంద‌ని ఆర్కే చెప్పారు. సీఐడీ పోలీసులు అంటే రాష్ట్ర ప్ర‌భుత్వం చేతులో ఉంటారు కాబట్టి.. కోరిన విధంగా వారు రిపోర్టులు తయారు చేసి ఇస్తారని సీఐడీ ఎంక్వైరీ అంటున్నారని ఆర్కే మండిప‌డ్డారు. సీఐడీ విచారణ అని స్పీకర్, విచారణ అయిపోయింది వైఎస్సార్సీపీ వాళ్లే ఈ పని చేశారని ఓ మంత్రి మాట్లాడుతున్నారంటే... జరిగిన ఘటనను కప్పిపుచ్చడానికి ఎంతగా ప్రయత్నిస్తారో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం కురిసింది కేవలం సెంటీమీటరేనని ఇకపై తుఫాన్ లు వస్తే ఈ ప్రాంతం పరిస్థితేమిటని ఆర్కే ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. రాజధానిలో ప్రభుత్వ అవినీతి నుంచి నిన్నటి లీకుల వరకు సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. నిన్నటి పైపును మాత్రమే ఫోటోలు చూయించారని, ఇవాళ మీడియాను తీసుకెళ్లేసరికి మళ్లీ జాయింట్ చేశారని ఆర్కే తెలిపారు. అలా జాయింట్ చేసినప్పుడు మీరు సీఐడీ ఎంక్వైరీ వేస్తే ఏమని రిపోర్ట్ ఇస్తుందని ప్ర‌శ్నించారు.

అసెంబ్లీ నిర్మాణ దశనుంచి వందలాది రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుందని ఆర్కే ఆరోపించారు. నిర్మాణ దశలోనే రెండు సార్లు పీసీసీ, ఆర్‌సీసీతో ఉన్నటువంటి ఫ్లోరింగ్ లు కుంగిపోయాయ‌ని గుర్తు చేశారు. ఆ దశలోనే ఎంక్వైరీ వేయాల్సిందని కానీ చేతులు దులుపుకున్నార‌ని మండిప‌డ్డారు. సీఐడీ ఎంక్వైరీ కాదు తక్షణం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్లపై పోరాటాలు చేస్తుంటే..సాక్షాత్తు రైలును తగులబెట్టారని సీఐడీ ఎంక్వైరీ వేసి ఇంతవరకు కూడా దానిని తేల్చలేదని ఆర్కే ప్ర‌స్తావించారు. ఎలాగా అయితే రైలు ద‌హ‌నం సమస్యను పక్కదారి పట్టించారో దీనిని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్కే మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/