Begin typing your search above and press return to search.
రాజన్న రైతు బజార్ల' కు ఆర్కే శ్రీకారం!
By: Tupaki Desk | 9 Nov 2018 4:08 PM GMTమంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి....ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవ చేస్తోన్న ఆర్కే...మరోవైపు సొంత డబ్బులతో సామాజిక సేవ కూడా చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఆకలితో అలమటిస్తోన్న నిరుపేదలకు పట్టెడన్నం పెట్టానే ధృఢ సంకల్పంతో ఈ ఏడాది మేలో `రాజన్న క్యాంటీన్లు` ప్రారంభించారు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రూ.4కే నాణ్యమైన - రుచికరమైన భోజనం అందిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ప్రారంభించిన `రాజన్న` క్యాంటీన్ లో ప్రతి ఒక్కరికి రూ.4 రూపాయలకే పూర్తి భోజనం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బృహత్తర కార్యక్రమానికి ఆర్కే శ్రీకారం చుట్టారు. తాజాగా - `రాజన్న రైతు బజార్`ను మంగళగిరిలో ఆర్కే శుక్రవారం నాడు ప్రారంభించారు.
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతోన్న నేపథ్యంలో నిరుపేదలు - మధ్య తరగతి వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఇబ్బందులను దూరం చేసేందుకు `రాజన్న రైతు బజార్` ను ఆర్కే ప్రారంభించారు. రూ.10 కే ఒక కుటుంబానికి వారం పాటు సరిపోయే కూరగాయలను అ రైతు బజార్ ద్వారా అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలు - మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే 12 ప్రాంతాల్లో ఈ రైతుబజార్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆర్కే తెలిపారు. వారం రోజులపాటు ఒక కుటుంబానికి సరిపోయే ఆకుకూరలు, కూరగాయలు కలిపి సుమారు 5 కిలోల కూరగాయలు రూ.10కే అందిస్తున్నామని చెప్పారు. ఈ రైతు బజార్ల కోసం ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటుచేసి తన సొంత డబ్బులతో నిధులను కేటాయించినట్లు తెలిపారు. మంగళగిరి ప్రాంతంలో కూరగాయలు పండించే రైతుల వద్దకు సంఘ సభ్యులు వెళ్లి కూరగాయలు సేకరిస్తారని చెప్పారు. దీని ద్వారా రైతులకు...ప్రజలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ట్రాన్స్ పోర్టు, దళారి కమిషన్ ...వంటి ఇబ్బందులు రైతులకు తప్పుతాయన్నారు.