Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి మీద రాజద్రోహం కేసు?
By: Tupaki Desk | 7 Nov 2015 7:17 AM GMTవినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దేశాన్నినడిపించే కేంద్ర సర్కారులో ప్రధానమంత్రి మోడీ తర్వాత అత్యంత శక్తివంతమైన కేంద్రమంత్రిగా పేరున్న అరుణ్ జైట్లీ మీద రాజద్రోహం కేసు నమోదు కావటమే కాదు.. కోర్టుకు విచారణకు రావటం సంచలనం సృష్టించింది. నిజానికి దీనికి సంబంధించిన వార్తలు పెద్దగా రాకపోవటం వల్ల ప్రచారం జరగలేదు కానీ.. ఒక కీలక కేంద్రమంత్రి మీద రాజద్రోహం కేసు నమోదై.. దానిపై కోర్టులో విచారణ జరగటం చిన్న విషయమేమీ కాదు కదా.
ఈ మధ్య తమిళనాడులో మద్యనిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా కళాకారుడు ఒకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ఉదంతంలో తమిళనాడు ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయటం సంచలనం సృష్టించింది. ఇలాంటి పరిస్థితిని కొంతమేర అర్థం చేసుకోవచ్చు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటివి చోటు చేసుకోవటం మామూలే. కానీ.. ఒక కేంద్రమంత్రి మీద రాజద్రోహం కేసు నమోదై.. కోర్టులో విచారణ జరిపే వరకూ వెళ్లటం చూసినప్పుడు.. అరుణ్ జైట్లీ చేసిన అంత మహాపరాధం ఏమిటని చూస్తే.. విస్మయం చెందాల్సిందే.
రాజద్రోహం కేసు నమోదు చేసేంత పెద్ద తప్పు అరుణ్ జైట్లీ ఏం చేశారంటే.. జాతీయ న్యాయ నియమకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహోబా జిల్లా కోర్టులో మంత్రి అరుణ్ జైట్లీపై దేశద్రోహుం కేసును నమోదు చేసి.. ప్రోసీడింగ్స్ స్టార్ట్ చేశారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జిల్లా కోర్టు తీసుకున్న నిర్ణయంపై మండిపడింది. జైట్లీపై ఈ తరహా చర్యలు ప్రారంభించటానికి అర్థవంతమైన కారణాలు కనిపించలేదంటూ కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉన్న వ్యక్తి మీదనే పుసుక్కున దేశద్రోహం కేసు నమోదు అయితే.. ఇక మిగిలిన సామాన్యుల సంగతేంది?