Begin typing your search above and press return to search.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను రాముడే కాపాడాలిః హైకోర్టు

By:  Tupaki Desk   |   18 May 2021 7:32 AM GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను రాముడే కాపాడాలిః హైకోర్టు
X
ఉత్త‌ర ప్ర‌దేశ్ లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతోంది. ప‌ట్ట‌ణాలు మొద‌లు.. గ్రామీణ ప్రాంతాల వ‌ర‌కు వేలాది కేసులు న‌మోదువుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అల‌హాబాద్ హైకోర్టు ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. రాష్ట్రలో ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని, ఇక యూపీని రాముడే ర‌క్షించాల‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కొవిడ్ బాధితుల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్న న్యాయ‌స్థానం.. ఈ విష‌యాలు త‌మ దృష్టికి వచ్చాయ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా మీర‌ట్ లో ఓ కొవిడ్ రోగి మృతిపై ముగ్గురు స‌భ్యుల క‌మిటీ స‌మ‌ర్పించిన నివేదిక‌ను కోర్టు వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

సంతోష్ కుమార్ అనే కొవిడ్ బాధితుడు చికిత్స కోసం చాలా సేపు వేచి ఉండి, విశ్రాంతి గ‌దిలోనే కుప్ప కూలాడ‌ని.. అత‌ని వ‌ద్ద‌కు వైద్యులు కూడా చాలా ఆల‌స్యంగా వ‌చ్చార‌ని, దీంతో.. అత‌డు మ‌ర‌ణించాడ‌ని కోర్టు చెప్పిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. అత‌ను చ‌నిపోయిన త‌ర్వాత కూడా విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌లేద‌ని, గుర్తుతెలియ‌ని వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్టు రిపోర్టులో పేర్కొన్న విష‌యాన్ని కూడా కోర్టు ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతున్నాయ‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. వ్య‌వ‌స్థ‌, సిబ్బంది తీరు ఎలా ఉందో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌నలే ఉదాహ‌ర‌ణ అని అన్న‌ట్టు స‌మాచారం. యూపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 ల‌క్ష‌ల పై చిలుకు కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.