Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ తండ్రిపై సీరియస్ ఎలిగేషన్

By:  Tupaki Desk   |   12 Nov 2022 9:01 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ తండ్రిపై సీరియస్ ఎలిగేషన్
X
సీఎం కేసీఆర్ సడ్డకుడి కుమారుడు, ఆయన సన్నిహిత ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రిపై సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఎంపీ సంతోష్ తండ్రి రవీందర్ రావు మోసం చేశాడంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ కత్తెరపాక శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంతో సహా నిరసనకు దిగాడు.

కరీంనగర్ లోని సిరిపురం కాలనీలోని రవీందర్ రావు ఇంటి ప్రహారీ గోడకు ఫ్లెక్సీ కట్టి తల్లి, భార్య, పిల్లలతో కలిసి గేటు వద్ద భైఠాయించాడు. ప్రొక్లెయినర్ కొనిచ్చేందుకు తన వద్ద కమీషన్ తీసుకున్న రవీందర్ రావు.. తన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మరికొంత సొమ్ము తీసుకొని మోసం చేశాడని బాధితుడు వాపోతున్నాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో రవీందర్ రావు ఇంటి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టాడు.

బాధితుడు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పారు. అందుకు శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

తమ డబ్బు ఇప్పించేలా చూడాలని బాధిుతుల పోలీసుల కాళ్లు మొక్కినా పట్టించుకోకుండా వారిని బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించుకొని తీసుకుపోయారు. తండ్రిని బలవంతంగా పోలీస్ వాహనంలో తరలించడాన్ని చూసిన అతడి కూతుళ్లు భయంతో రోదించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు తోడల్లుడి ఈ మోసాన్ని ఎదిరిస్తే పోలీసులతో అరెస్ట్ చేస్తారా? మాకు న్యాయం జరగదా? అని ఆ కుటుంబం రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.