Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ రచ్చరచ్చ అవుతోంది
By: Tupaki Desk | 2 Nov 2016 5:46 AM GMTభోపాల్ లో సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ వివాదాస్పదమవుతోంది. అది ఎన్ కౌంటర్ కాదని ఉగ్రవాదులను మూకుమ్మడిగా పట్టుకొని కాల్చి చంపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండగా - అది వాస్తవంగా జరిగిన ఎన్ కౌంటర్ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యాయవిచారణకు తిరస్కరించిన సీఎం ఈ ఘటనకు మతం రంగు పులమొద్దని - రాజకీయం చేయొద్దని కోరారు. ఎన్ కౌంటర్ పై ఎటువంటి దర్యాప్తు జరుగబోదని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్రసింగ్ తేల్చి చెప్పారు. సిమీ ఉగ్రవాదులకున్న సంబంధాలపై మాత్రమే ఎన్ ఐఏ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
ఎన్ కౌంటర్ పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జాతీయ మానవహక్కుల సంఘం మధ్యప్రదేశ్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లో సిమీ కార్యకర్తలు - ముస్లింలు మాత్రమే జైళ్ల నుంచి ఎందుకు పారిపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సందేహం లేవనెత్తారు. జైలు నుంచి పారిపోయిన సిమీ కార్యకర్తలు సజీవంగా దొరికి ఉంటే అసలు నిజాలు వెల్లడయ్యేవని, అవి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే వారినికాల్చి చంపారని దిగ్విజయ్ ట్విట్టర్ లో ఆరోపించారు.ఉగ్రవాదుల వద్ద ఆయుధాలున్నాయన్న పోలీసుల ప్రకటనను ఎత్తిచూపుతూ - జైలు నుంచి పారిపోయిన కొద్ది గంటల్లోనే వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ పై ఎన్ ఐఏ దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరుగాలని, భోపాల్ జైలు పనితీరుపై న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఎన్ కౌంటర్ పై సీబీఐ దర్యాప్తును కోరుతూ మృతుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయని వారి తరఫు న్యాయవాది పర్వేజ్ ఆలం చెప్పారు. ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తున్నదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసులను రాజకీయ - మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్ తీరుపై సందేహాలున్నందున న్యాయవిచారణ ద్వారా నిజాలు వెల్లడవుతాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఎనిమిది మంది జైలు నుంచి పారిపోవడం, వారి ఆచూకీని కనుగొనడం, ఆ తర్వాత వారిని కాల్చి చంపిన తీరు అసాధారణంగా ఉందని, స్వతంత్ర న్యాయ విచారణ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని వామపక్షాలు అభిప్రాయపడ్డాయి. జైలు నుంచి తప్పించుకున్న వారు పారిపోయేందుకు వాహనం వెతుక్కోకుండా - ఆయుధాలు వెతుక్కున్నారన్న వాదన అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నాయి. విపక్షాల ఆరోపణలు - సందేహాలను కేంద్ర మంత్రులు - బీజేపీ నేతలు తోసిపుచ్చారు. కొందరు భద్రతా దళాలపై కన్నా చట్టాన్ని ఉల్లంఘించిన వారి పట్ల సానుభూతి చూపుతున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ కు మతం రంగు పులుమడం చిల్లర రాజకీయం అన్నారు. జాతీయ భద్రతపై అందరూ ఒకే స్వరం వినిపించాలని మరో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/