Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఫారిన్ ట్రిప్ వెళ్లి తప్పు చేశారా?
By: Tupaki Desk | 9 May 2016 5:30 PM GMTఊహించని పరిణామాలకు ఏపీ వేదిక కానుందా? ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తన వైఖరిని సూటిగా చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి ఆరురోజుల విదేశీ పర్యటన కారణంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కానుందా? అంటే కొంతమేర అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రమంత్రులు ఒకరికి ఇద్దరు స్పష్టంగా తేల్చేయటం.. దీనిపై ఏపీ అధికార.. విపక్షాలుతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రియాక్ట్ అయి.. కాస్త సర్దుబాటు ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తానేమీ చేయనున్నాన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పింది లేదు. ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై చంద్రాబు మరింత స్పష్టత ఇచ్చి ఫారిన్ టూర్ వెళితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. దాదాపు ఆరు రోజులు రాష్ట్రంలో తాను ఉండని నేపథ్యంలో హోదా విషయంలో కేంద్రం దృష్టికి ఏదైనా డిమాండ్ కానీ.. ఏపీ ప్రజలకు తాను చేయాలనుకుంటున్న కార్యాచరణను మరింత వివరంగా వెల్లడించి ఉంటే బాగుండేదన్న వాదన ఉంది.
ఇదిలా ఉంటే.. మరోపక్క అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా మీద కేంద్రం తీరును తప్పు పడతూ.. ఏపీ విపక్షానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. వామపక్షవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనంతపురంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. వీరికి సంఘీభావం పలికేందుకు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ హైటెన్షన్ నడుస్తోంది.
తాను ఆరు రోజులు రాష్ట్రంలో లేని నేపథ్యంలో.. ప్రత్యేక హోదా మీద కేంద్రానికి ఏదైనా వినతి చేసి బాబు ఫారిన్ ట్రిప్ వెళ్లి ఉంటే.. ఆయన తన పని తాను చేసినట్లు ఉండేది. ఇప్పుడు ఈ అంశం మీద కొందరు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కులాసాగా ఫారిన్ టూర్లు వెళతారా? అన్న విమర్శలు వెల్లువెత్తటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయం మీద అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి.. అందరిని కలుపుకోవటం.. కేంద్రానికి ఒక వినతిపత్రం ఇవ్వటం లాంటి కార్యక్రమాలు చేసి.. ఫారిన్ టూర్ కు చంద్రబాబు వెళ్లి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మరి.. బాబు ఫారిన్ ట్రిప్ ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందా? లేదా? అన్నది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలే స్పష్టం చేయటం ఖాయం.