Begin typing your search above and press return to search.
ఈవీఎం ట్యాంపరింగ్.. ఎంతవరకు నిజం
By: Tupaki Desk | 22 May 2019 11:19 AM GMTదేశంలోని 21 ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ తాజాగా చంద్రబాబు నేతృత్వంలో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచేస్తోందంటూ గగ్గోలు పెడుతున్నాయి. వీవీ ప్యాట్స్ అన్నీ లెక్కించాలని సుప్రీంను, ఈసీని కోరుతున్నాయి. మరి నిజంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది.
ఓడిపోయిన అభ్యర్థులను గెలిపించడం.. గెలిచినవారిని ఓడిపోయేలా చేయడాన్నే ట్యాంపరింగ్ అంటారు. నిజానికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటేనే మనం ఈవీఎంలను యాక్సెస్ చేసి తారుమారు చేయడానికి ఆస్కారం ఉంటుంది.కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవీఎంలకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. దీంతో ట్యాంపరింగ్ కు అవకాశం ఉండదని ఎన్నికల అధికారులు వాదిస్తున్నారు.
అయితే ఈవీఎంలను తరలించే క్రమంలో గానీ.. వాటిని స్ట్రాంగ్ రూంలో నిల్వ చేసినప్పుడు కానీ దొంగచాటుగా తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపర్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేస్తే ఫలితాలను తారుమారు చేయవచ్చు. కానీ స్ట్రాంగ్ రూములో ఫుల్ సెక్యూరిటీ, సీసీ నిఘా కెమెరాలుంటాయి. దీంతో పాటు ఎవ్వరినీ ఆ దరిదాపుల్లోకి కూడా రానీయరు. ఇక అభ్యర్థులను కూడా అక్కడ కాపాలాగా ఉండేందుకు ఈసీ అనుమతించింది. దీంతో ట్యాంపరింగ్ చేసే అవకాశాలు తక్కువ.
ఇక ఈవీఎంలు తయారు చేసినప్పుడే ట్యాంపరింగ్ చేయాలనుకోవడం కష్టమే. వీటిని ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే తయారు చేస్తాయి,. ఒకవేళ అధికారంలో ఉన్న వాళ్ల చేత ముందే ప్రోగ్రాం రాయించి గెలిచేలా చేసుకున్నా.. ఆ ఈవీఎం మిషన్ దేశంలోని ఏ ప్రాంతానికి పంపిస్తారనేది తెలియదు. దీంతో ఈవీఎంలను ట్యాంపర్ చేయాలనుకునే పార్టీలకు ముందుగా ప్రోగ్రాం చేయించుకున్నారనుకున్నా.. ఆయా ప్రాంతాల్లో పోటీచేసే పార్టీలు, ఎంత మంది పోటీచేస్తారు? ఎవరు నిలబడతారోనన్న విషయం తెలియకుండా ట్యాంపరింగ్ చేయడానికి వీలుండదు.
ఇక ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్ల వల్ల పారదర్శకత పెరిగింది. ఓటేసిన జనాలకు తాము ఎవరికి ఓటేశామనే విషయంపై స్క్రీన్ పై తెలుస్తుంది. దీంతో ఎవరూ అక్రమాలు జరగాయనడానికి వీలులేకుండా ఉంది. అయితే ప్రతీ నియోజకవర్గంలో వీవీ ప్యాట్స్ లెక్కిస్తే మరింత పాదర్శకత వస్తుంది.కానీ అది పెద్ద ప్రహసనం.. సాధ్యం కాదు.. అందుకే ట్యాంపరింగ్ విషయంలో ప్రతిపక్షాల రాద్ధాంతం ఒట్టిదేనని చెప్పకతప్పదు..