Begin typing your search above and press return to search.

నిజాం ఖజానా కొల్లగొట్టడానికి కేసీఆర్ ప్లానింగ్?

By:  Tupaki Desk   |   28 Oct 2016 11:38 AM GMT
నిజాం ఖజానా కొల్లగొట్టడానికి కేసీఆర్ ప్లానింగ్?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొత్త ఆరోపణలు వస్తున్నాయి. ఆయన నిజాం రాజుల ఖజానాపై కన్నేశారని.. అందులో భాగంగానే సెక్రటేరియట్ ను కూలగొట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న సెక్రటేరియట్ నిజాంలు కట్టించిన ప్యాలస్. దాన్ని సైఫాబాద్ ప్యాలస్ గా పిలిచేవారు. ఈ భవంతి కింద నేల మాళిగలు ఉన్నాయని.. అందులో నిజాంలు భారీగా సంపదను దాచిపెట్టారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అది తాజాగా మరోసారి మొదలైంది.. కేసీఆర్ సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్తది కట్టించే ఆలోచనలో ఉండడంతో అది ఈ ఖజానాను కైవసం చేసుకోవడానికే అని వినిపిస్తోంది.

సెక్రటేరియట్ కు ఉన్న వాస్తు దోషాల్ని పూర్తిగా తొలగించి అక్కడ కొత్త భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే... ఉద్యోగ వర్గాల్లో మాత్రం మరో ప్రచారం జరుగుతోంది. పాత సచివాలయంలోని జీ బ్లాక్ కింద భారీగా ఖజానా ఉందని.. దాన్ని కొల్లగొట్టడానికి భారీ స్కెచ్ వేశారని చెప్పుకొంటున్నారు.

మరోవైపు గతంలో సచివాలయం ఎదురుగావున్న విద్యారణ్య పాఠశాలలో నేలమాళిగలు ఉన్నాయన్న వదంతులతో పురావస్తు శాఖ అక్కడ తవ్వకాలు జరిపింది. కానీ.. అలాంటి దాఖలాలేమీ అక్కడ నిధుల జాడ కనిపించలేదు. అయితే.. గదుల వంటి నిర్మాణాలు మాత్రం బయటపడ్డాయి. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు భూగర్భ మార్గం ఉందని... అదంతా కోట్ల కోట్ల ఖజానాకు నిలయమని చెబుతుంటారు. సచివాలయంలోని జీ బ్లాక్ కింద కూడా అలాగే భారీ ఖజానా ఉందన్న ప్రచారం ఉంది. తాజాగా కేసీఆర్ చర్యలతో ఆ ప్రచారం మరోసారి మొదలవడమే కాకుండా కేసీఆర్ పైనే అనుమానాలకు తావిస్తోంది. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా అవినీతిపరంగా కేసీఆర్ కొంతవరకు మచ్చలేని నేతే. అనుచరులు, కుటుంబసభ్యుల విషయం పక్కనపెడితే కేసీఆర్ పై భారీ ఆరోపణలేమీ లేవు. కానీ... ఇప్పుడిలాంటి ఆరోపణలు రావడంతో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/