Begin typing your search above and press return to search.
పెద్ద నోట్ల గోల.... మోడీది సెల్ఫ్ గోలా...?
By: Tupaki Desk | 19 Nov 2016 10:20 AM GMTపెద్ద నోట్లను రద్దు చేసిన తొలినాళ్లలో అహోఒహో అన్నవారు కూడా క్రమంగా ఇందులో కష్టాలు అర్థం చేసుకుంటున్నారు. అంతేకాదు... మోడీకి ఇది పెద్ద దెబ్బ అని.. మోడీతో పాటు బీజేపీ కూడా మునిగిపోవడం ఖాయమని అంటున్నారు. బీజేపీలోని పెద్దలు కూడా లోలోన ఆందోళన చెందుతున్నా మోడీని కాదనలేక మొహమాటానికి శబాష్ అంటున్నారు. అయితే... మెల్లమెల్లగా బీజేపీలోనే మోడీపై విమర్శలు మొదలవుతున్నాయి. స్వపక్షం నుంచే విమర్శలు ఎదువుతున్నాయి.
బీజేపీ నేతలే కొందరు పెద్దనోట్ల రద్దు విషయంలో అంబానీ - ఆదానీలకు ముందే తెలిసిపోయిందని చెప్పడంతో మోడీ పరిస్థితి మరింత ఇబ్బందిగా తయారైంది. మొదట అరుణ్ శౌరి - సుబ్రమణ్యస్వామిలు మోడీపై పదునైన విమర్శలు చేశారు. తాజాగా మరికొందరు గొంతు కలిపారు. నోట్ల రద్దుపై స్పందించిన అరుణ్ శౌరి.. వచ్చే ఎన్నికల్లో భార్యపిల్లలు - కుటుంబకష్టాలు తెలిసిన వ్యక్తికి ఓటేయాలని సూచించారు. మోడీలాంటి మూర్ఖుడిని మాత్రం ఎన్నుకోవద్దని దేశ ప్రజలకు సూచించారు. తాజా పరిణామాలతో మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా వారికి జత కలిశారరు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితికి నరేంద్రమోడీయే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల మార్పిడి ప్రక్రియలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
పెద్ద నోట్ల గురించి బడా పారిశ్రామికవేత్తలకు ముందే తెలుసని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నపళంగా పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అనాలోచిత నిర్ణయం అని కూడా విమర్శించారు. అంతేకాదు... 2000 నోటు నాణ్యత ఏమీ బాగులేదని.. దాన్ని చూస్తుంటే నకిలీ నోటులా అనిపిస్తోందన్నారు. డబ్బులు మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆర్ ఎస్ ఎస్ మాజీ సిద్దాంతకర్త గోవిందా చార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పెద్దనోట్లు రద్దు చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న యోగా గురువు బాబా రామ్ దేవ్ కూడా ఈ పరిస్థితులు చూసి మోడీకి వ్వతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో భార్యాపిల్లలు లేని వ్యక్తుల వల్లే సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలా బీజేపీలో మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రధాని డిఫెన్సులో పడ్డారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/