Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు ఇంగ్లిష్ రాదా?

By:  Tupaki Desk   |   16 Oct 2016 6:24 AM GMT
లోకేష్‌ కు ఇంగ్లిష్ రాదా?
X
లోకేష్ సాధించిన విజయాలను చూసి ఓర్వలేక జగన్మోహన రెడ్డి మరియు ఆయన అనుచరులు.. ఆడిపోసుకుంటూ ఉంటారని, పసలేని ఆరోపణలు చేస్తూ ఉంటారని తెలుగుదేశంలో లోకేష్ ప్రాపకం కోసం ఎగబడుతున్న నాయక గణాలంతా నోరు చేసుకుంటూ ఉంటాయి. ఇది ఇటీవలి కాలంలో చాలా మామూలుగా మారిపోయింది. ఒక రాజకీయ పార్టీగా జాతీయ కమిటీకి తాను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఎలా జరుగుతుందో మౌలికమైన విషయాలు కూడా తెలియని లోకేష్ కు కనీసం మిగిలిన విషయాల్లోనైనా ఉండే జ్ఞానం ఏ పాటిది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇపుడు జరుగుతోంది.

లోకేష్ అమెరికాలో ఎంబీయే చేసినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు అని అయితే ఆ స్థాయి తెలివితేటలను, అమెరికాలో బాచిలర్ డిగ్రీ మరియు పీజీ కూడా చేసిన వ్యక్తికి ఉండవలసిన భాషా పటిమను గానీ ఆయన ఎన్నడూ ప్రదర్శించినట్లుగా కనిపించదని వారి పార్టీలోనే కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

లోకేష్ కు కనీసం ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడడం కూడా చేతకాదనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఇంగ్లిషులో ధారాళంగా మాట్లాడగా మనకు ఎక్కడా కనిపించదని పలువురు అంటున్నారు. ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. ఎన్నడూ జాతీయ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పాపాన పోని నాయకుడు బహుశా లోకేష్ ఒక్కరే అయి ఉంటారని, తన బలహీనత బయటపడిపోకుండా ఆయన జాగ్రత్త పడుతుంటారని అనుకుంటున్నారు. ట్విట్టర్ - ఫేస్ బుక్ లలో మాత్రం లోకేష్ పేరిట బోలెడు వ్యవహారం నడుస్తుంటుంది. అయితే ఇదంతా కూడా లోకేష్ ఉద్యోగులుగా - కాంట్రాక్టులుగా నియమించుకున్న వారు రాస్తున్న భాషే తప్ప లోకేష్ పాండిత్యం కాదని కూడా విమర్శలు వినిపిస్తుంటాయి.

అయితే నారా చంద్రబాబునాయుడుకు ఇంగ్లిషు రాదా అని జగన్మోహనరెడ్డి ప్రశ్నిస్తుంటారు. కానీ నిజానికి ఆ పార్టీకి ఆదునిక తరం - నవతరం - సాంకేతికతరం ప్రతినిధి అయిన లోకేష్ కు కూడా ఇంగ్లిషు రాదా అని జనం అనుకుంటున్నారు.