Begin typing your search above and press return to search.
సోమిరెడ్డి రెండిళ్ల పూజారా?
By: Tupaki Desk | 1 Nov 2016 5:21 AM GMTసోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి.. రాజకీయాలను గమనిస్తుండే ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరది. ఒకప్పుడు మంత్రిగా పనిచేసినా ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చి సరిపెట్టేసిన నేత. చాలాకాలంగా మంత్రి పదవి కోసం ఆశ పడుతున్నా అవన్నీ అడియాశలే అవుతున్నాయి. పైగా.. రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దకముందే చంద్రబాబుతో ఉన్న సంబంధాల కారణంగా నెల్లూరు జిల్లాకే చెందిన నారాయణ సంస్థల అధినేత నారాయణ మొన్నటి ఎన్నికల తరువాత నేరుగా మంత్రి అయిపోయారు. అయిపోవడమే కాకుండా చంద్రబాబుకు కుడి ఎడమ భుజం కూడా తానే అయి రాజధాని పనులన్నీ తన చేతుల్లోకి తీసుకుని మరీ నడిపించారు. మంత్రి పదవి - చంద్రబాబుతో సాన్నిహిత్యం అన్నీ ఉండడంతో నెల్లూరు జిల్లా మొత్తం నారాయణ వైపే తిరిగిపోయింది. సోమిరెడ్డి వర్గం కృశించుకుపోయింది. అయితే.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నారాయణపై పైచేయి సాధించలేకపోతున్న సోమిరెడ్డి ఇప్పుడు ఏకంగా కొత్త రూటులో వెళ్తున్నారట. ప్రతిపక్షంతో కలిసి సొంత పార్టీలోని తన ప్రత్యర్థి నారాయణపై ఆరోపణలు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయం సోమిరెడ్డి ప్రత్యర్తి అయిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వెలుగులోకి తేవడంతో సోమిరెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి - టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య మాటలు దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి. మంత్రి నారాయణను వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శించడం వెనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమేయం ఉందని కాకాని తాజాగా చెప్పడం కలకలం రేపింది. వైసీపీ ఎమ్మెల్యేలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే ఫోన్లు చేసి మరీ నారాయణను విమర్శించాలని పాయింట్లు అందిస్తున్నారని కాకాని బాంబు పేల్చారు. కావాలంటే కాల్ డేటా పరిశీలించాలన్నారు.
కాకాని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో మంత్రి నారాయణ కూడా సోమిరెడ్డిపై తనకు ఉన్న అనుమానాన్ని కన్ఫర్ము చేసుకుంటున్నారు. ఇంతకాలం నెల్లూరు సీటీ - అర్బన్ వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సోమిరెడ్డి వల్లే తనను తిట్టిపోస్తున్నారని నారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోనే వెన్నుపోటు దారులు తయారయ్యారని ఆయన తన సన్నిహితుల వద్ద పదేపదే చెబుతున్నారట. అంతేకాదు.. త్వరలోనే చంద్రబాబుకు ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/