Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరి పొత్తు... వైసీపీ ఎత్తు... ?
By: Tupaki Desk | 27 Oct 2021 12:30 AM GMTపొత్తు రాజకీయాలు భారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి పొత్తు పెట్టుకోవడం అంటే ప్రజాభిప్రాయాన్ని మభ్యపెట్టడమే. భావసారూప్యం అని దానికి కలరింగ్ ఇస్తారు కానీ అంత సారూప్యత ఉంటే ఒకటే పార్టీగా ఉండొచ్చు కదా. వేరు వేరు కుంపట్లు ఎందుకు. మరో వైపు చూస్తే ఇద్దరు ముగ్గురు కలసి ఒక్కడి మీద పోరాడడంగా కూడా పొత్తులను చెప్పాలి. ఇందులో నైతికం, అనైతికం అన్న సంగతి కూడా పక్కన పెట్టొచ్చేమో. ఎందుకంటే రాజకీయాల్లో ఆ పదాలకు అసలు అర్ధాలు కూడా దొరకవు. ఇంతకీ విషయం ఏంటంటే పొత్తుల గురించి ఎక్కువగా ఏపీలోనే ఎక్కువగా చర్చ సాగుతూ వస్తోంది. పక్కన ఉన్న తెలంగాణాలో తీసుకుంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ వేరుగానే పోటీ చేస్తాయి. ఇక వైఎస్ షర్మిల పెట్టిన కొత్త పార్టీ కూడా ఎటువంటి పొత్తులు ఉండవని చెప్పేసింది. సో. ఏపీలోనే పొత్తుల ఎత్తుల గురించి గట్టిగా మాట్లాడుకోవాలి.
ఇక ఏపీలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు కచ్చితంగా కుదురుతుంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలసి 2024లో ఎన్నికల్లో వైసీపీని ఢీ కొడతాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఒక అవగాహనకు కూడా ఇప్పటికే వచ్చాయా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికార వైసీపీ దీని మీద దృష్టి సారించింది. జనసేన టీడీపీ పొత్తు ఖాయమనుకునే వైసీపీ వచ్చే ఎన్నికల మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే వాటి ప్రభావం ఎక్కడ ఉంటుంది. ఏఏ జిల్లాల్లో ఉంటుంది అన్నదే ఇపుడు అధికార పార్టీలో హాట్ హాట్ టాపిక్.
అయితే అధికార పార్టీ విశ్లేషణను తీసుకుంటే గోదావరి జిల్లాలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అది కూడా మొత్తానికి మొత్తం 34 నియోజకవర్గంలో ఉండదు, కేవలం పది నుంచి పదిహేను నియోజకవర్గంల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లుగా ధీటైన వ్యూహంతో ముందుకు సాగితే కచ్చితంగా ఈ పొత్తుని చిత్తు చేయగలమని కూడా వైసీపీ భావిస్తోందిట. మరో వైపు చంద్రబాబు, పవన్ గురించి ఇప్పటికే ఏపీ జనాలకు అవగాహన ఉందని, ఆ ఇద్దరు గతంలో కూడా కలిశారు కాబట్టి అదేమీ కొత్తగా కనిపించే చాన్స్ లేదని అంటున్నారు. ఆ రెండు పార్టీల మీద జనాలకు నమ్మకం కూడా పెద్దగా ఉండదని, దాంతో సులువుగానే తాము ఈ కాంబినేషన్ ని చిత్తు చేసి మరో మారు అధికారం దక్కించుకోగలమని ఆశపడుతోందిట. మొత్తానికి ఆ ఇద్దరూ కలిసినా ఎలాంటి అద్భుతాలు అయితే ఏపీలో జరిగిపోవు అన్నదే వైసీపీ ధీమాగా ఉంది అంటున్నారు.