Begin typing your search above and press return to search.
తెలంగాణలో టీడీపీతో పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 15 Jan 2023 3:30 AM GMTతెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ అందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఎలాగైనా సరే తెలంగాణలో వచ్చేసారి సామధానబేధ దండోపాయాలు వేసి అయినా గెలవడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా కేసీఆర్ ను కూలదోయాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ ఏజెంట్లను పంపి కొనుగోలు యత్నాలు బెడిసికొట్టడంతో రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి పరిమితమైన చంద్రబాబు మళ్లీ వచ్చి ఖమ్మంలో సభ పెట్టడం.. ఢిల్లీ వెళ్లి షర్మిల అమిత్ షాతో భేటి కావడం.. ఇలా పలు రకాల పరిణామాలు తెరవెనుక జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా తెలంగాణలో బీజేపీకి సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ, జనసేన రెడీగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు బీజేపీని తెలంగాణలో గెలిపించేందుకు కలిసి సాగాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఏపీలో టీడీపీ+జనసేన పొత్తు ఖాయమన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీని కూడా ఇందులో కలుపుకుపోవాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటే ఇది తప్ప మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే ముందుగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు కూటమి కలిసి సాగాలా? లేక విడివిడిగానే అవగాహనతో ముందుకెళ్లాలా? అని ఆలోచిస్తోంది.
అయితే తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ స్పందించారు. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని కుండబద్దలుకొట్టారు. ఇక షర్మిల వైఎస్ఆర్టీపీతోనూ తమకు ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టతనిచ్చారు. ఇలాంటి వదంతలు వ్యాప్తి చేయడం మానుకోవాలని తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు.
గురువారం ఢిల్లీలో మాట్లాడిన తరుణ్ చుగ్ ఈ మేరకు టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ ఆలోచిస్తోందని స్పష్టతనిచ్చారు. ఈ అంశం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెంచింది. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించింది. త్వరలోనే నిజామాబాద్ లోనూ సభ పెడుతామని ప్రకటించారు. అదే సమయంలో అసలు టీడీపీ ఇలా తెలంగాణలో మళ్లీ బల ప్రదర్శన చేయడానికి కారణం.. బీజేపీ పొత్తుల కోసం ప్రయత్నించడమేనని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేశాయి. బీజేపీ ఐదు, టీడీపీ 14 సీట్లలో గెలిచాయి. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ బలం పెరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా లేదు. అందుకే ఈ రెండు పార్టీలు కలిస్తే గెలుపు గ్యారెంటీ.. కానీ కేసీఆర్ ఆంధ్రా వాదం తెచ్చి దెబ్బతీస్తాడని బీజేపీ భయపడుతోంది.టీడీపీతో పొత్తును ఖండిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.