Begin typing your search above and press return to search.
హేతువాదులకు హిందూ పండుగలే కనిపిస్తాయా?
By: Tupaki Desk | 22 Dec 2015 5:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అయుత చండీ యాగం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆ పదవిలో ఉండి ఇటువంటి యాగాలు చేయడం నిజంగా సాహసమే. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అదే సమయంలో ఇప్పుడు ఆయనపై హేతువాదుల విమర్శలు కూడా మొదలయ్యాయి.
భారతదేశం లౌకిక రాజ్యమని హేతువాదులే చెబుతారు. లౌకిక రాజ్యం కనక మంత్రులు - ముఖ్యమంత్రులు - ప్రధాన మంత్రులు యాగాలు - పూజలు చేయకూడదని ఆంక్షలు పెడుతూ ఉంటారు. వారిని విమర్శిస్తూ ఉంటారు. లౌకిక రాజ్యంలో మరి ప్రభుత్వం అధికారికంగా క్రైస్తవ విందులను నిర్వహించవచ్చా? ప్రభుత్వం అధికారికంగా రంజాన్ మాసంలో ముస్లిములకు దావత్ లు ఇవ్వచ్చా? ప్రభుత్వం అధికారికంగా ఇప్తార్ విందులు ఇవ్వవచ్చా? హజ్ యాత్రలకు కోట్లకు కోట్లు డబ్బులు ఇవ్వవచ్చా? మసీదులు - చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయించవచ్చా? ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు కానీ క్రైస్తవ విందులు ఇచ్చినప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని అయినా హేతువాదులు కానీ దళిత సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ విమర్శలు చేశాయా? ఇది తప్పని చెప్పాయా? అప్పుడు చెప్పని హేతువాదులు కేవలం హిందూ పూజలుః - పండుగలకే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని హిందూ అనుకూల శక్తులు ఇప్పుడు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి, ఇటువంటి ప్రశ్నలను అవి అంతర్గతంగా వేసేవి. గళం పైకి రాకుండా లోపల్లోపలే విమర్శించడం, కుమిలిపోవడం చేసేవి. కానీ, సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఇప్పుడు వాటి కూడా తమ గళాన్ని సమర్థంగా వినిపిస్తున్నాయి. వాట్సప్ - ఫేస్ బుక్ - ట్విటర్లలో అవి హేతువాదులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇందుకు కొన్నిచోట్ల హేతువాదులు కూడా జవాబులు ఇస్తున్నారు.
లౌకిక రాజ్యంలో హిందూ - ముస్లిం - క్రైస్తవ - సిక్కు,.. ఇలా అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలనూ చేయవచ్చు. అన్నీ చేసినప్పుడు ఎవరూ తప్పు పట్టకూడదు. లేదా అసలు ఏ మతానికి సంబంధించిన వ్యవహారాలు ప్రభుత్వంలో ఉండకూడదని డిమాండ్ చేయవచ్చు. అంతే తప్పితే హిందువులకు ఒక న్యాయం, మిగిలిన వారికి ఒక న్యాయం ఉండకూదని, ఈ విషయంలో హేతువవాదులు ఆలోచించుకోవాలని హిందూ అనుకూల శక్తులు కోరుతున్నాయి.