Begin typing your search above and press return to search.

పులుసులో ములక్కాయ పవన్?

By:  Tupaki Desk   |   20 Oct 2015 3:54 AM GMT
పులుసులో ములక్కాయ పవన్?
X
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను అభిమానించే వారు విపరీతమైన వేదనకు గురి అవుతున్నారు. సోమవారం చోటు చేసుకున్న ఘటనతో వారి విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరటానికి ప్రత్యక్షంగా పని చేసి.. ఎన్నో మాటలు పడి.. ఎలాంటి స్వార్ధం లేకుండా.. మరెలాంటి ప్రయోజనాలు ఆశించకుండా పని చేసిన తమ నాయకుడ్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పులుసులో ములక్కాయ మాదిరి చూడటమేమిటని వాపోతున్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పిలవకుండా.. తన మంత్రుల బృందాన్ని పంపించి పిలిపించటంపై ఇప్పటికే కొద్దిపాటి అసంతృప్తి నెలకొంది. ఇదే విషయాన్ని పవన్ కు ఆహ్వానపత్రాన్ని ఇచ్చినప్పుడు మీడియా ప్రస్తావిస్తే.. చంద్రబాబు సీఎంగా ఉంటారు కాబట్టి.. ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి కదా అని సింఫుల్ గా తేల్చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురిలో సందేహాలు వ్యక్తమైనా.. పవన్ మాటలతో పెద్దగా పట్టించుకుంది లేదు.

కానీ.. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును చంద్రబాబు స్వయంగా ఆహ్వానించటం తో పవన్ అభిమానుల్లో అసంతృప్తి భగ్గుమందని చెబుతున్నారు. రామోజీ.. పవన్ లలో ఎవరు గొప్ప అన్న మాట కంటే కూడా.. రామోజీని పిలిచినప్పుడు పవన్ ని ఎందుకు పర్సనల్ గా ఆహ్వానించలేదన్నది ప్రశ్నగా వినిపిస్తోంది.

ఎన్నికల వేళ.. పవన్ ఇంటికి వెళ్లి.. ఆయనతో చర్చలు జరిపి.. ఎన్నికల్లో తమ తరఫున ప్రచారం చేయటానికి ఒప్పించిన చంద్రబాబు.. అదికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ను మర్చిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరానికి వాడుకొని.. అవరం తీరిన తర్వాత పులుసులో ములక్కాయలా పవన్ ని చేసేశారన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల్లో పనవ్ పడిన కష్టాన్ని అప్పట్లో సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రస్తావించేవారు. పవన్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటిది శంకుస్థాపన కార్యక్రమానికి స్వయంగా పిలవలేదంటే సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ప్రోటోకాల్ సమస్యలు పవన్ కు ఉంటే.. రామోజీకి కూడా ఉంటాయని.. కానీ.. రామోజీ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. పవన్ దగ్గరకు వెళ్లకపోవటం చూస్తే.. పిలుపుల విషయంలో పవన్ ను చంద్రబాబు అవమానించినట్లుగా పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి..ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో..?