Begin typing your search above and press return to search.
మంత్రి వర్సెస్ ఎంపీ.. వార్ పీక్ స్టేజ్ కి..
By: Tupaki Desk | 18 Oct 2019 12:34 PM GMTఒకరేమో జిల్లాకు మంత్రి.. మరొకరేమో అదే జిల్లాకు ఎంపీ.. కానీ వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి గెలిచారు. అందుకే వైరం ముదిరిపాకాన పడింది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన బీజేపీ పార్టీ ఎంపీ సోయం బాపురావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైందట.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు ఇక్కడ యమ రంజుగా నడుస్తోంది. విమర్శలు... ఎదురుపడితే కొట్టుకోవడమే అన్నట్టుగా వీరిద్దరి మధ్య గొడవలు పెచ్చరిల్లుతున్నాయి.
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కుమ్రం భీం వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు.. వేదికపైనున్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు మైక్ నందుకొని తెలంగాణ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. గిరిజనుల భూములకు పట్టాలివ్వాలని మంత్రిని కోరారు. వేదికపై అటవీ మంత్రి ఇంద్రకరణ్ నే తప్పుపట్టారు. కేసీఆర్ ను తిట్టిపోశారు.
ఆ తర్వాత మైక్ నందుకున్న మంత్రి అల్లోల బీజేపీపై కూడా ఇదే స్తాయిలో నిప్పులు చెరిగారు. కేంద్రం పన్నులు గుంజుతూ పైసా విదిల్చడం లేదని.. సోయం సమక్షంలోనే ఎదురుదాడి చేశాడు. దమ్ముంటే సోయం ఆ డబ్బులు ఇప్పించు అంటూ సవాల్ చేశారు.
ఇలా కుమ్రం భీం వర్థంతి వేదికపై మంత్రి అల్లోల, ఎంపీ సోయం దాదాపు కొట్టుకునే పరిస్థితి ఎదురైందట..సభా వేదిక మొత్తం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇలా అధికారిక కార్యక్రమాలు రెండు పార్టీల మధ్య ఆధిపత్యపోరుకు వేదిక అవుతున్నాయి. జిల్లాపై పట్టు కోసం ఎంపీ, మంత్రి చేస్తున్న పోరు కాకరేపుతోంది.