Begin typing your search above and press return to search.
దొంగలకు చెమటలు పట్టేలా చేసిన అనంతవాసులు
By: Tupaki Desk | 1 Nov 2019 12:08 PM GMTఏదైనా అనుకోని విధంగా జరిగితే కొన్నిచోట్ల విపరీతమైన స్పందన ఉంటే.. మరికొన్నిచోట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. మరికొన్నిచోట్ల అయితే.. తమ సొంతానికే నష్టం జరిగినట్లుగా ఫీల్ కావటమే కాదు.. దాని సంగతేమిటో చూసే వరకూ నిద్రపోరు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అనంతపురంలోచోటు చేసుకుంది.
ఈ వ్యవహారం తెలిసిన దొంగలు ఎవరూ అనంతపురం వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయపడతారని చెప్పక తప్పదు. అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ అనే పంచాయితీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.16 లక్షల్ని బ్యాంకు నుంచి డ్రా చేసింది.
దాన్ని బ్యాగులో పెట్టుకొని ఆటో ఎక్కుతున్న వేళ.. కళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి మరీ బ్యాగ్ లాక్కెళ్లిపోయాడు. వెంటనే ఆమె తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగినపోలీసులు.. చుట్టుపక్కల గ్రామాల్లోని వారిని అలెర్ట్ చేశారు. అంతే.. అప్పటివరకూ వేరే పనుల్లో ఉన్నోళ్లు కూడా.. తమ పనులు వదిలేసి.. సదరు దొంగ సంగతి తేల్చాలని రంగంలోకి దిగారు.
ఇలా దిగినోళ్లు దగ్గర దగ్గర వెయ్యి మంది వరకూ ఉంటారని అంచనా. మరింత మంది రంగంలోకి దిగి వెతకటం మొదలెడితే దొంగ దొరక్కుండా ఉంటాడా? చుట్టుపక్కల గ్రామాల సమిష్టిగా పని చేసిన దానికి ఫలితంగా దొంగను పట్టుకున్నారు. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు. దొంగ దోచుకున్న భారీ మొత్తాన్ని బాధితురాలికి అప్పజెప్పారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఏమైనా.. చోరీ జరిగింది సర్లే.. అని విని ఊరుకోకుండా ఉరుకులు పరుగులు పెట్టిన వైనాన్ని పలువురు అభినందిస్తున్నారు.