Begin typing your search above and press return to search.
జార్ఖండ్ లోని ఆ గ్రామం మరో నైజీరియా
By: Tupaki Desk | 29 May 2017 12:29 PM GMTసైబర్ నేరాలు - ఆన్ లైన్ మోసాలు అనగానే టక్కున గుర్తుకొచ్చే దేశం నైజీరియా. ఆన్ లైన్ మోసాల్లో సగం నైజీరియన్లు చేసేవే ఉంటున్నాయి. నైజీరియా చుట్టుపక్కలున్న పలు ఇతర ఆఫ్రికా దేశాలవారికీ ఇందులో పాత్ర ఉంటోంది. కానీ... ఇండియాలోనూ ఇలా ఆన్ లైన్ మోసాలకు ఒక ప్రాంతం ప్రసిద్ధి చెందుతోంది. జార్ఖండ్ లోని ఆ గ్రామంలో చాలామంది ఇదే పనిలో ఉంటున్నారట.
జార్ఖండ్ లోని గిర్ దై జిల్లా, టికు మండలంలోని బీన్ స్మి గ్రామం సైబర్ నేరాలకు అడ్డాగా మారుతోంది. దేశంలో జరిగే ఆన్ లైన్ మోసాలకు కేంద్రంగా మారింది. ఇందులో ప్రధానంగా నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఆగ్రామంలోని సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారు. సుమారు వెయ్యి జనాభా ఉన్న అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక ఆన్ లైన్ మోసగాడు ఉన్నాడని పోలీసులు అంటున్నారు.
ఈ గ్రామానికి చెందిన సైబర్ నేరగాళ్లు రాజస్తాన్ - గుజరాత్ - మహారాష్ట్ర - పంజాబ్ రాష్ట్రాలను ఎక్కువగా టార్గెట్ చేశారట. ఒక్కొక్కరు రోజుకు సుమారు 200 ఫోన్ కాల్స్ చేసి మాయమాటలతో క్రెడిట్ - డెబిట్ కార్డుల సమాచారం సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా వీరి ట్రాప్ లో పడితే అంతే సంగతులు. దీనికోసం ఇలాంటి నేరగాళ్లు ఒక్కొక్కరు 25 నుంచి 30 వ్యాలట్ అకౌంట్లు... పది పదిహేను మెయిల్ ఐడీలు మెంటైన్ చేస్తున్నారు. వీరి వద్ద పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు ఉంటున్నాయి. అయితే... గుజరాత్ రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో వీరి బారిన పడినవారు ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా అక్కడి పోలీసులు వచ్చినా స్థానిక పోలీసుల నుంచి సరైన సహకారం అందడం లేదట. దీంతో జార్ఖండ్ పోలీసులు కూడా వీరికి సహకరిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/