Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన ఆయన లవ్ స్టోరీ
By: Tupaki Desk | 19 April 2016 9:45 AM GMTఅస్సాంలో ఎన్నికలు మంచి రసపట్టులో ఉన్న వేళ అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాసలీలలు బయటకొచ్చి కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నాయి. క్లీన్ ఇమేజి ఉన్న తరుణ్ గొగోయ్ పై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ - తానూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నామని అస్సాం గాయని అలోక పాండే వెల్లడించారు. తన గత కాలపు మధురానుభూతులను ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో నెమరు వేసుకున్నారు. తన తల్లి - ప్రముఖ జానపద గాయని ప్రతిమ బారువా పాండే మరణించడంతో ఉద్యోగం కోసం తాను తరుణ్ గొగోయ్ ని 2004లో కలిసినట్లు అలోక పాండే తెలిపారు. తనను చూసిన తరుణ్ పరవశుడయ్యారని, ఇరువురం 2004 నుంచి 2006 వరకు ప్రేమలో మునిగి తేలామని వెల్లడించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం కోయినధారలో అణువణువూ తనకు తెలుసునని తెలిపారు.
అంతేకాదు... గౌరిపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని చెప్పడంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అలోకా పాండే తెలిపారు. సీఎంతో తనకు ఎఫైర్ ఉందన్న విషయం చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలకు, మంత్రులకు కూడా తెలుసని ఆమె చెప్పారు. కాగా, అలోక పాండే 2006లో ఈ విషయాన్ని బయటపెట్టినపుడు తరుణ్ గొగోయ్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఆమె అవే ఆరోపణలను మళ్లీ చేయడంపై తరుణ్ గొగోయ్ స్పందిస్తూ.. ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఈసారి తాను పరువు నష్టం దావా వేయబోనని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో గతంలో శక్తిమంతమైన నేత హిమాంత బిశ్వ శర్మ భార్య నడుపుతున్న ఛానల్ లో అలోక పాండే ఇంటర్వ్యూ ప్రసారమైంది. హిమాంత ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. దీంతో ఇదంతా బీజేపీ కుట్ర అని గొగోయ్ ఆరోపిస్తున్నారు.