Begin typing your search above and press return to search.

పెట్రోల్ తో పాటుగా డీజిల్ కూడా సెంచరీ కోట్టేసింది ... ఎక్కడంటే

By:  Tupaki Desk   |   12 Jun 2021 2:30 PM GMT
పెట్రోల్ తో పాటుగా డీజిల్ కూడా సెంచరీ కోట్టేసింది ... ఎక్కడంటే
X
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. తమ దూకుడును కొనసాగిస్తూనే పోతోన్నాయి. ఇంధన ధరల తగ్గింపు విషయాన్ని దాదాపు మర్చిపోయినట్టే కనిపిస్తోన్నాయి. కిందటి నెల 4వ తేదీన ఏ ముహూర్తంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు పూనుకున్నాయో గానీ.. దానికి ఎక్కడా బ్రేకులనేవే పడట్లేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. ఇక డీజిల్ వంతు వచ్చింది. డీజిల్ రేటు కూడా లీటర్ ఒక్కింటికి 100 రూపాయల మార్క్‌ను దాటేసింది. పెట్రోల్ రేటు 107కు చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 27 పైసలు, డీజిల్ 23 పైసల మేర పెరిగింది.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌‌లో రూ.106.87, మహారాష్ట్రలోని పర్భణీలో 104.64, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 102.73 పైసలుగా నమోదైంది. శ్రీగంగానగర్‌లో డీజిల్ ఏకంగా 100.05 పైసలకు చేరింది. డీజిల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. చమురు సంస్థలు ఇప్పుడు ప్రదర్శిస్తోన్న దూకుడు ఇదే తరహాలో కొనసాగిస్తే.. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ డీజిల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటడానికి ఎన్నో రోజుల పట్టకపోవచ్చు.