Begin typing your search above and press return to search.
అల్విదా ఇమ్రాన్.. పాక్ కొత్త ప్రధాని షాబాజ్
By: Tupaki Desk | 10 April 2022 6:38 AM GMTఓ గొప్ప క్రికెటర్ రాజకీయ ప్రస్థానం అర్థంతరంగా ముగిసింది. నయా పాకిస్థాన్ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. అస్థిర ప్రజాస్వామ్యంలో ఆయన మూడున్నరేళ్ల ప్రధానిగానే మిగిలిపోయారు. ఏ ఒక్క ప్రధానీ పూర్తి కాలం పదవిలో కొనసాగిన చరిత్ర లేని పాకిస్థాన్ లో ఆ చరిత్ర మళ్లీ కళ్లకు కట్టింది. ఇదివరకు ప్రజా ప్రభుత్వాలను సైన్యం కూలదోస్తే..నేడు ప్రతిపక్షాలు ఒక్కటై తప్పించాయి. ఇదొక్కటే ఈసారి పాక్ రాజకీయాల్లో ప్రత్యేకత. చివరి బంతి వరకు ఆడతానంటూ చెప్పుకొచ్చిన ఇమ్రాన్ చివరకు వికెట్ పారేసుకున్నారు. రాజీనామాకు ససేమిరా అంటూ వచ్చిన ఆయనకు చివరకు వైదొలగక తప్పలేదు. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 174 మంది మద్దతు పలికారు. దీంతో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. పాక్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధాని ఇమ్రానే కావడం గమనార్హం. కాగా, పాక్ లో ఇమ్రాన్ సహా అయిదుగురు మాత్రమే కనీసంగా మూడేళ్లు ఆ పీఠంపై కూర్చోగలిగారు.
లియాఖత్ అలీ ఖాన్ అత్యధికంగా 1,524 రోజులు కొనసాగారు. పదవిలో ఉండగానే 1951 అక్టోబరు 16న ఆయన హత్యకు గురయ్యారు. తదనంతరం ఏడేళ్ల లో ఆరుగురు ప్రధాన మంత్రులు మారారు. 1947 నుంచి 1958 వరకు పదకొండేళ్ల కాలంలో ఏడుగురు ప్రధాని పదవి అలంకరించారు. తొలి సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్థాన్‌కు 23 ఏళ్లు పట్టింది. 1970లో జరిగిన ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్‌లో అవామీ లీగ్, పశ్చిమ పాకిస్థాన్‌లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఆధిక్యం సాధించాయి. తదనంతర రాజకీయ సంక్షోభం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.
నవాజ్ కు మూడుసార్లూ పదవీ భంగమే
పాక్ రాజకీయాల్లో తలపండిన నేత అయిన నవాజ్ షరీఫ్ మూడు సార్లు (1990, 1997, 2013) ప్రధాని పదవిని చేపట్టినప్పటికీ ఏ విడతలోనూ ఐదేళ్ల కాలం కొనసాగలేకపోయారు. అవినీతి ఆరోపణలతో రెండు సార్లు(1993, 2017), సైనిక తిరుగుబాటుతో ఒకసారి(1999) పదవీచ్యుతుడయ్యారు. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్లు ప్రధాని పదవిలో ఉన్నారు.
సైన్యం చెరలో 32 ఏళ్లు
పాకిస్థాన్ రాజకీయాలు అంటేనే సైన్యం పెత్తనం. నిరంకుశ సైన్యం.. ఆ దేశాన్ని 32 ఏళ్లపాటు దేశాన్ని పాలించింది. తనకు తాను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్న ఆయుబ్‌ఖాన్ 1958 నుంచి 1969 వరకు, జనరల్ యాహ్యాఖాన్ సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా 1969 నుంచి 1971 వరకు, జనరల్ జియా ఉల్ హక్ 1978 నుంచి 1988 వరకు, జనరల్ ముషారఫ్ 2001 నుంచి 2007 వరకు దేశాధ్యక్ష పదవిలో కొనసాగారు. పాకిస్థాన్ సైన్యం మూడు సార్లు పౌర ప్రభుత్వాలను కూలదోసింది.
ఎవరీ షాబాజ్ షరీఫ్..?
ఇమ్రాన్ వైదొలగిన నేపథ్యంలో పాక్ తదుపరి ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. షాబాజ్.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండో సోదరుడు. పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేతగా ఉన్నారు. 70 ఏళ్ల షాబాజ్.. పంజాజ్ రాష్ట్రానికి మూడుసార్లు సీఎం గా పనిచేశారు. సోదరుడు నవాజ్ మూడుసార్లు మధ్యలోనే ప్రధాని పదవిని కోల్పోతే.. షాబాజ్ సీఎం మూడు సార్లు మధ్యలోనే పదవిని కోల్పోవడం విశేషం. కాగా, అన్నలాగే ఈయన కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అవినీతి కేసులకు సంబంధించి కోర్టు ఇచ్చిన బెయిల్ పై బయట ఉన్నారు. సహజంగానే సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన లండన్, దుబాయ్‌లో విలాసవంతమైన భవంతులను కలిగి ఉన్నారు. షాబాజ్.. ఆవేశపూరిత వక్త. స్టేజీ పై, మైకుల ముందు మాట్లాడుతూనే ఊగిపోతుంటారు. అంతేకాదు తన ప్రసంగంలో కవితలు చదువుతుంటారు. ఈయన రెండు వివాహాలు చేసుకున్నట్లు వికీపీడియాలో ఉంది.
ఇమ్రాన్ నిష్క్రమించారిలా..
అవిశ్వాస తీర్మానంలో ఓటమిని ముందే ఊహించిన ఇమ్రాన్- సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరుగుతున్న సమయంలోనే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచీ ఓటింగును వ్యూహాత్మకంగా వాయిదా వేసేలా చేస్తూవచ్చి.. రాత్రికి తన నివాసంలో ఇమ్రాన్ కీలక కేబినెట్ భేటీ నిర్వహించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్ సైతం ఆయన్ను కలుసుకొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని ‘ముఖ్యమైన పత్రాలు’కేబినెట్ నుంచి తనకు అందాయని.. వాటిని ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్ చూడవచ్చని
అసద్ ఖైసర్ తెలిపారు. అనంతరం పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీకి చెందిన ప్యానెల్ ఛైర్మన్ అయాజ్ సిద్దీఖ్‌ను సభా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆయన కోరారు. ఈ పరిణామం అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగు ప్రక్రియ మొదలుకాగా.. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.