Begin typing your search above and press return to search.
ఎంపీనే బురిడీ కొట్టించి రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు !
By: Tupaki Desk | 19 May 2020 1:30 PM GMTఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలని పక్కన పెట్టి ..ప్రజాప్రతినిధులపై ఫోకస్ పెట్టారు. సైబర్ మోసాలతో ప్రజల అకౌంట్ల నుంచి తెలివిగా డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్ల మోసాలు... ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ సైబర్ మోసగాడు ఏకంగా ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీని బురిడీ కొట్టించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేంద్రం నిధుల పేరుతో అమలాపురం ఎంపీకి సైబర్ నేరగాడి వల వేశాడు. రూ. 2 లక్షలు పేటీఎంలో పంపించి ఎంపీ మోసపోయాడు. దీంతో రహస్యంగా పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో బాలాజీనాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 35 మంది ప్రజాప్రతినిధుల్ని ఈ నిందితుడు మోసం చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా ఎంపీ లనే బురిడీ కొట్టించాడు అంటే ..సాధారణ ప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడండి.