Begin typing your search above and press return to search.
కామ ఆద్మీ పార్టీ?
By: Tupaki Desk | 21 Sept 2016 5:18 PM ISTఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కష్టాలు వచ్చిపడుతున్నాయి. అయితే.. అవన్నీ ఏరికోరి తెచ్చుకున్నవే. ఆప్ నేతలు వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంటుండడంతో సీఎం కేజ్రీవాల్ తల పట్టుకుంటున్నారు. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ సెక్సువల్ హెరాస్ మెంట్ కేసులో అరెస్టవడంతో ఆప్ పరువు బజారున పడింది. ఆప్ నేతలు చేస్తున్న వెధవ పనుల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని కాకుండా దాన్ని కామ ఆద్మీ పార్టీ అని అనాల్సి వస్తుందేమో.
ఒఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఖాన్ పై స్వయానా ఆయన మరదలే కేసు పెట్టింది. తనపై ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, శారరీక సంబంధం పెట్టుకోమని బలవంతం చేస్తున్నారని... తనపై అత్యాచారానికి పలుమార్లు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అమానతుల్లా ఖాన్ ను ఈ రోజు అరెస్టు చేశారు. దీంతో అమానతుల్లా ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కాగా ఇటీవల ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ మహిళలతో రాసలీలలు జరుపుతున్న అశ్లీల వీడియో సీడీ వెలుగుచూడటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాసలీలలు చేయడం ఒక ఎత్తయితే... పోర్ను వెబ్ సైట్లలో కూడా ఆయన భాగస్వామ్యం ఉందని.. అందుకోసమే ఆ రాసలీలలని తేలడం ఇంకో ఎత్తు. అసలే అత్యాచారాలకు పేరుపడ్డ ఢిల్లీలో ఏకంగా మంత్రులే ఇలా కామాతురాణం న భయం న లజ్జ అంటుంటే ప్రజల పరిస్థితి ఏమిటో కేజ్రీవాలే చెప్పాలి.