Begin typing your search above and press return to search.
ఇలా అయితే.. ఆమంచి గేర్ మార్చాల్సిందేనా?
By: Tupaki Desk | 26 Sep 2022 1:30 AM GMTఔను! రాజకీయాలు ఎప్పుడూ.. సానుకూలంగా ఉండవు. ఎప్పుడు ఎలాగైనా మారిపోయే అవకాశం మెండుగా ఉంటుంది. దీనికి అనుగుణంగా నాయకులు మారాల్సిన పరిస్థితి ఎప్పుడూ.. ఉంటుంది. ఇదే ఇప్పుడు.. వైసీపీ కీలక నాయకుడు.. ఫైర్ బ్రాండ్.. ఆమంచి కృష్ణమోహన్‌కు కూడా ఎదురవుతోందని అంటున్నారు. కొన్నాళ్లుగా.. ఆయన పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు.. వాయిస్ కూడా వినిపించడం లేదు. గత మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా తన అనుచరులనునిలబెట్టి ఏకంగా.. చీరాలలోని 11 వార్డులను దక్కించుకున్న ఆయన.. చక్రం తిప్పాలని అనుకున్నారు.
కానీ, ఇప్పటి వరకు ఆయనకు పార్టీ అధిష్టానం నుంచి సరైన.. సూచనలు కానీ.. సరైన మార్గదర్శనం కానీ.. రాలేదు. ఈ పరిణా మాలతో ఆయన ఒకింత ఆవేదనలో ఉన్నారని అంటున్నారు. ఆది నుంచి చీరాలను కంచుకోటగా చేసుకుని ఆమంచి చక్రం తిప్పారు. అంతేకాదు.. గత ఎన్నికలకు ముందు.. ఆయన వైసీపీ పంచన చేరి.. టికెట్ దక్కించుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరుగులుపెట్టినా.. ప్రకాశంలో టీడీపీ పట్టు పెంచుకుని.. నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకుంది. వాటిలో చీరాల ఒకటి. అయితే.. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న కరణం బలరామకృష్ణమూర్తి మాత్రం .. తర్వాత.. వైసీపీ గూటికి చేరిపోయారు.
ఈ పరిణామాన్ని సహించలేని.. ఆమంచి.. అనేక రూపాల్లో పైచేయి సాధించేందుకుప్రయత్నించారు. అయినా.. కూడా జగన్ మాత్రం.. ఆయనను పట్టించుకోలేదనే టాక్ ఉంది. ఇక, ఇప్పుడు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనకు టికెట్ పరిస్థితి ఏంటనేది.. ఆమంచి ఆవేదన. ఇప్పటికే.. ఆయనకు స్పష్టంగా.. పరుచూరు నియోజకవర్గానికి వెళ్లిపోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అయితే.. తాను వెళ్లేది లేదని. ఆమంచి కూడా అదే దూకుడుగా చెప్పారు. అంతేకాదు.. ఇప్పటి వరకు పరుచూరు ముఖం కూడా చూడలేదు. తాను ఖచ్చితంగా చీరాల నుంచే పోటీ చేయాలని అనుకున్నారు.
కానీ, ఖచ్చితంగా ఇక్కడే ఆమంచి దూకుడు కు బ్రేక్ పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది అది కూడా.. వైసీపీ నుంచి కాకుండా.. టీడీపీ వైపు నుంచి తీసుకున్న నిర్ణయం.. ఆమంచిని తర్జన భర్జన కు గురిచేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు..త న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు చెంచురామ్‌కు.. చీరాల టికెట్ ఇవ్వనున్నారనేఏ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. తన మిత్రుడు.. వ్యాపార భాగస్వామి కూడా అయినా.. చెంచురామ్‌పై పోటీ చేసే పరిస్థితి ఆమంచికి లేదు. ఇక, చెంచురామ్‌ను వద్దని చెప్పే అవకాశం కూడా లేదు. తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న చెంచురామ్ గెలుపు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో నే ఆమంచి గేర్‌మార్చి.. పరుచూరు బాటపడతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.