Begin typing your search above and press return to search.
భక్తి పేరిట మోసం!... ఆమంచి బోల్తా పడలేదు!
By: Tupaki Desk | 1 May 2019 4:27 PM GMTభక్తి... ఎంతటివారైనా ఇట్టే తలొంచే అంశం. దీనికి ధనిక, పేద అన్న తేడా లేదు. భక్తి పేరిట మోసం చేసే స్వాములకు ఇదే పెద్ద పెట్టుబడి. మనిషిలోని భక్తి భావం.. ఏ ముఖ పరిచయం లేని వారిని కూడా నమ్మంచేస్తుంది. అందుకే ఇప్పుడు భక్తి పేరిట మోసాలు బాగా పెరిగిపోయాయి. మోసాల సంఖ్య పెరగడమే కాదండోయ్... స్వాములోరు టార్గెట్ చేస్తున్న వ్యక్తుల స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నోళ్లను టార్గెట్ చేయడం మానేసిన దొంగ స్వాములు, దొంగ బాబాలు... బడా బాబులనే టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే తనను కూడా టార్గెట్ చేయబోయిన ఓ దొంగ స్వామిని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ పోలీసులకు పట్టించారు.
ఇప్పుడు చీరాల సహా ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకెళితే... సహదేవుడు(స్వామి), కుమార్‌బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒక జట్టు. వీరిలో కుమార్‌బాబు బడాబాబులను ముందుగా కలుస్తుంటాడు. వారికి సహదేవుడు (స్వామి) గురించి గొప్పగా చెప్తుంటాడు. స్వామి పూజచేస్తే ఎన్నో శుభఫలితాలు వస్తాయని నమ్మిస్తాడు. ఇలా వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలనే చుట్టేశారు. అలాగే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి ఇంటికి కూడా వచ్చారు. ముందుగా అక్కడున్నవారితో మాట్లాడారు. పూజవిధివిధానాలు వివరించారు. అందుకు సంబంధించి కావల్సిన పూజాద్రవ్యాలు అవసరమని నమ్మబలికారు. కొన్ని పూజా ద్రవ్యాలు తమవద్ద ఉన్నాయని మరికొన్ని తీసుకురావల్సి ఉందని చెప్నారు. అందుకుగాను కొంత మొత్తం తీసుకున్నారు. ఆ తరువాత పూజ చేసినందుకు తాము వినియోగించిన పూజా ద్రవ్యాలు మొత్తం రూ.12.50 లక్షలు అవుతాయని చెప్పారు.
దీంతో అక్కడ ఉన్నవారికి మతిపోయింది. అదే సమయంలో ఆమంచి అక్కడకువచ్చారు. విషయం తెలుసుకున్న ఆమంచికి వారిపై ఎందుకనో డౌట్ వచ్చింది. దీంతో వారితో తానే నేరుగా మాట్లాడారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో తన అనుమానం నిజమేనని రూడీ చేసుకున్న ఆమంచి వేటపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో సహదేవుడు (స్వామి) చిన్నగా అక్కడి నుంచి జారుకోగా.. కుమార్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా దొంగ బాబాల మాటలకు ఇట్టే పడిపోతున్న బడాబాబుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో ఆమంచి మాత్రం వారి బుట్టలో పడకుండా... వారినే పోలీసులకు పట్టించేశారన్న మాట.