Begin typing your search above and press return to search.

చీరాల లో మరోసారి ఉద్రిక్తత .. ఆమంచి vs కరణం

By:  Tupaki Desk   |   27 Nov 2019 7:11 AM GMT
చీరాల లో మరోసారి ఉద్రిక్తత .. ఆమంచి vs కరణం
X
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రావణ కాష్టంలా మండి పోతుంది. టీడీపీ , వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నారు. ఇక చీరాల లో ఉండే పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ టీడీపీ , వైసీపీ వర్గీయుల మధ్య నిత్యం ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి చీరాలలో ఉద్రికతత పరిస్థితులు ఏర్పడ్డాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీనితో చీరాల లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.

పూర్తి వివరాలని ఒకసారి చూస్తే ..ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యే గా కరణం బలరాం ఉన్నారు. ఈయన స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నవశకం కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళ్లగా ,,అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కరణం కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీనితో టీడీపీ కార్యకర్తలు కూడా పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తరువాత ఆ వివాదం ఒకరినోకరు తోసుకునే వరకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం గా మారింది.

దీని తో వెంటనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ..వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి, అక్కడి నుండి పంపేసిన పోలీసులు, పట్టణం లోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బందో బస్తును ఏర్పాటు చేశారు. ఇకపోతే కరణం పై గతంలో రెండు సార్లు వరుసగా గెలిచిన ఆమంచి.. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓడి పోయిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో వివాదాస్పద నేతలుగా పేరున్న ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఉండటం తో తరచుగా చీరాలలో గొడవలు జరుగుతూనే ఉంటాయి.