Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ మించిన బిలియ‌నీర్ ఆయ‌న‌..!

By:  Tupaki Desk   |   13 Sep 2016 4:40 AM GMT
బిల్ గేట్స్ మించిన బిలియ‌నీర్ ఆయ‌న‌..!
X
ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుడు ఎవ‌రంటే... అంద‌రూ బిల్ గేట్స్ అని చెబుతారు! కానీ బిల్ గేట్స్ కి మించిన బిలియ‌న‌ర్ ఒక‌రు ఇప్పుడు ఆ జాబితాలో చేరారు. గేట్స్‌ ను ప‌క్క‌కు తోసేసి టాప్ బిలియ‌నీర్ అయ్యారు. ఆయ‌నే.. అమంక్యో ఒర్టెగా. అతిపెద్ద క్లాతింగ్ చైన్ వ్యాపార సంస్థ జారా వ్య‌వ‌స్థాప‌కుడు. 78 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ఆయ‌న బిల్ గేట్సుకు మించిన సంప‌న్నుడ‌య్యారు. మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ ఆస్తుల విలువ 77.4 బిలియ‌న్ డాల‌ర్లు. ఇంత‌వ‌ర‌కూ ప్ర‌పంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించిన గేట్స్ స్థానంలోకి ఒర్టెగా వ‌చ్చారు. అయితే... రాత్రికి రాత్రే ఒర్గెటా సంప‌ద ఇంత‌గా పెరిగిపోలేదు. ఈ విజ‌యం వెన‌క ఎంతో క‌ష్టం ఉంది. ఎన్నో నిద్ర‌లేని రాత్రులున్నాయి. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలూ ఉన్నాయి. ఎంతో స్ట్ర‌గుల్ చేసి ఈరోజున ఈ స్థాయికి చేరుకున్నారు ఒర్టెగా.

స్పెయిన్ లోని లాకొరునా ప్రాంతంలో జ‌న్మించారు ఒర్టెగా. ఈయ‌న తండ్రి ఒక సాధార‌ణ రైల్వే కూలీ. 13వ సంవ‌త్స‌రంలోనే చ‌దువు మానేశారు ఒర్టెగా. ఒక దుస్తుల దుకాణంలో రోజువారీ కూలి ప‌నికి చేరారు. ఆ త‌రువాత‌, దుస్తుల వ్యాపారంలో అనుభ‌వం గ‌డించి... సొంతంగా జారా పేరుతో ఓ సంస్థ‌ను ప్రారంభించి వ్యాపారం మొద‌లుపెట్టారు. మాజీ భార్య రొసీలియా మెరాతో క‌ల‌సి వ్యాపారం చిన్న‌గా ప్రారంభ‌మైంది. కొన్నేళ్ల‌పాటు ఎంతో శ్ర‌మించి ఆ వ్యాపారం సక్సెస్ చేసుకున్నారు. త‌రువాత, సొంతంగానే ఇండిటెక్స్ ఫ్యాష‌న్ గ్రూప్ నెల‌కొల్పారు. అటుపై వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్త‌రిస్తూ వ‌చ్చారు. నిరంత‌ర శ్ర‌మ‌ - అలుపెరుగ‌ని ప్ర‌యాణం... ఇవే ఒర్టెగా విజ‌య ర‌హ‌స్యాలు.

ఒర్టెగా ప్ర‌పంచంలోనే నంబ‌ర్ బిలియ‌నీర్. ఆయ‌న లైఫ్ స్టైల్ ఎంతో ల‌గ్జ‌రీగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫీస్ క్యాంటీన్ లోనే ఉద్యోగుల అంద‌రి మ‌ధ్య‌లో కూర్చుని భోజ‌నం చేస్తుంటారు. కాఫీ కూడా త‌న క్యాబిన్ లోకి తెప్పించుకోరు. స‌హోద్యోగుల‌తోనే క‌లిసి తాగుతూ ఉంటారు. పెద్ద‌పెద్ద బంగ్లాలూ కారులూ కూడా ఒర్టెగాకి లేవు. కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిప‌డ్డ‌ట్టుగానే ఇల్లూ కారూ ఉన్నాయి. పిల్ల‌ల పెంప‌కంలో కూడా ఇదే సింపిల్ సిటీ. ఎవ‌రి కాళ్ల‌మీద వాళ్లు ఎద‌గాల‌ని ఒర్టెగా చెబుతుంటారు. ఆయ‌న కంపెనీలో త‌యారయ్యే దుస్తుల‌కు ఆయ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌. త‌న ఫ్యాక్ట‌రీలో త‌యారైన దుస్తుల‌ను మాత్ర‌మే ధ‌రిస్తారు. ఎన్నో క‌ష్టాలుప‌డి ఈ స్థాయికి వ‌చ్చిన ఒర్టెగా మూలాలు మ‌రిచిపోలేదు. క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకుంటూ ఉంటారు. వివిధ సేవా కార్య‌క్ర‌మాల కోసం భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 28 బిలియ‌న్ డాల‌ర్ల‌కు `కార్య‌క్ర‌మాల కోసం ఖ‌ర్చు చేశారు. మొత్తానికి... ఆర్థికంగానే కాదు, హ‌ర్థికంగానూ నంబ‌ర్ వ‌న్ అనిపించేలా అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు ఒర్టెగా.