Begin typing your search above and press return to search.
ప్రారంభమైన మహా యాత్ర.. రాజధాని ఆకాంక్షే.. ఆలంబనగా!
By: Tupaki Desk | 12 Sep 2022 4:38 AM GMTఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరగుతున్న ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చేపట్టనున్న మహాపాదయాత్ర 2.0కు ఈ ఉదయం అంకురార్పణ జరిగింది. ఈ తెల్లవారుజామున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు.
ఉదయం 9 గంటలకు జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు. వెంకటపాలెంలో ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటుంది.
ఈ క్రమంలో దారి పొడవునా.. అనేక మంది ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకురెడీ అయ్యారు. అమరావతిపై అధికార పెద్దల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, రాజధాని ఆవశ్యకతను చాటేందుకు... రైతులు రెండో విడత మహాపాదయాత్ర చేపట్టారు. రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలందరికీ ఫలాలు అందుతాయనే విషయాన్ని... ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
అమరావతి అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తుందని వివరించనున్నారు. దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే... అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
కానీ మొండి వైఖరి వీడని వైసీపీ ప్రభుత్వం... ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా, అఫిడవిట్‌లతో కాలయాపన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో 'బిల్డ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్ర చేస్తున్నారు.
దీనిని విజయవంతం చేయడం ద్వారా.. రాష్ట్రం మొత్తం.. రైతుల పక్షానే నిలిచిందనే సందేశాన్ని పంపించాలని.. అప్పుడైనా.. సర్కారులో చేతనం కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ క్రతువులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని.. వారు ఆకాంక్షిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.