Begin typing your search above and press return to search.

అమరావతి ప్రయారిటీ ప్లానింగ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:01 AM GMT
అమరావతి ప్రయారిటీ ప్లానింగ్ ఏమిటి?
X
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ముసాయిదాప్లాన్ కత ముగిసినట్లే. తాజాగా తుది ప్లాన్ చేతికి వచ్చేసింది. ముసాయిదాలో అనుకున్న దానికి.. తాజాగా వచ్చిన తుది ప్లాన్ కు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం. మొత్తం అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం నాలుగు ప్రయారిటీ ప్రాజెక్టులుగా మార్చారు. ఈ ప్రాజెక్టులను ప్రయారిటీల వారీగా చూస్తే..

ప్రయారిటీ 1 (జరీబు భూముల్లో ప్రభుత్వ భవనాలు)

= అసెంబ్లీ

= సచివాలయం

= మంత్రుల క్వార్టర్లు

ప్రయారిటీ 2 (అమరావతికి గుండెకాయ)

= ఉద్దండరాయుని పాలెం.. మందడం ప్రాంతాల్లో సీడ్ కమర్షియల్

ప్రయారిటీ 3 (చదువుల కేంద్రం)

= యూనివర్సిటీలు

= ప్రఖ్యాత విద్యా సంస్థలు

= శాఖమూరు.. ఐనవోలు ప్రాంతాల్లో ఏర్పాటు

ప్రయారిటీ 4 (పరిశ్రమలకు కేరాఫ్)

= పారిశ్రామిక కేంద్రాలు

= ఉండవల్లి.. డోలాస్ నగర్.. మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలు

ఏది ఎక్కడంటే..

= ఎక్కువ జనసాంద్రత జోన్; లింగాయపాలెం.. తాళ్లాయపాలెం

= జనరల్ కమర్షియల్ జన్; అనంతవరం.. తుళ్లూరు.. దొండపాడు.. మల్కాపురం.. కృష్ణాయపాలెం.. బేతంపూడి.. కురగల్లు.. పెనుమాక.. మరికొన్నిప్రాంతాల్లో

= సెంట్రల్ బిజినెస్ జోన్; లింగాయపాలెం.. తాళ్లాయపాలెం మధ్యలో

= బిజినెస్ పార్క్ జోన్; నెక్కల్లు.. తాళ్లాయపాలెం

= లాజిస్టిక్ జోన్; నులకపేట.. బాపూజీనగర్

= కాలుష్యరహిత పారిశ్రామిక జోన్; వడ్డమాను.. నిడమర్రు.. నెక్కల్లు.. బాపూజీనగర్.. నులకపేట

= నిషేధిత జోన్; ఎర్రబాలెం

= ప్రభుత్వ జోన్ ; రాయపూడి

= విద్యాజోన్ ; నేలపాడు.. శాఖమూరు.. కృష్ణాయపాలెం

= స్పెషల్ జోన్; రాయపూడి.. ఉద్దండరాయునిపాలెం.. వెలగపూడి.. కుచుకుల పాలెం.. నెక్కల్లు, నిడమర్రు.. శాఖమూరుల్లోని కొంత భాగం