Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయ ఉద్యోగుల ట్రైన్ రెండో రోజే క్యాన్సిల్

By:  Tupaki Desk   |   21 Jun 2016 4:18 PM GMT
ఏపీ సచివాలయ ఉద్యోగుల ట్రైన్ రెండో రోజే క్యాన్సిల్
X
విభజన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం సికింద్రాబాద్ నుంచి బెజవాడ వరకు ప్రత్యేక రైలును సోమవారం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ ను స్టార్ట్ చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విజయవాడకు వచ్చి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి స్టార్ట్ చేయించారు. హైదరాబాద్ లో ఉండే ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ రైలుకు ద్వితియ విఘ్నం తప్పలేదు.

సోమవారం సాయంత్రం బెజవాడ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకున్నా.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య పరుగులు తీయాల్సి ఉన్నా.. దీన్ని రైల్వే అధికారులు క్యాన్సిల్ చేశారు. ట్రైన్ ఎందుకు రద్దు అయ్యిందన్న విషయాన్ని చెప్పని అధికారులు.. త్వరలోనే ఈ ట్రైన్ ను షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ గా నడుపుతామని వెల్లడించారు. శుభమా అని కొత్త ట్రైన్ స్టార్ట్ అయ్యాక.. ఈ ద్వితీయ విఘ్నం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆర్భాటంగా స్టార్ట్ చేసిన రైలుబండి రెండో రోజే ఆగిపోవటం ఏమిటో..?