Begin typing your search above and press return to search.
ఏపీ రాజధానిపై అపోహల్ని తీర్చే 'అమరావతి'.. అదెలానంటే?
By: Tupaki Desk | 7 Sep 2022 11:30 AM GMTఏపీ రాజధాని అమరావతి అన్నంతనే బోలెడన్ని ప్రశ్నలు ఇట్టే చుట్టు ముట్టేస్తుంటాయి. మరికొందరికి అయితే ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఇంకా ఏదో ఒక సందేహం మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఇలాంటివేళ.. రాజధానిగా నిర్ణయించిన అమరావతి మీద ఎన్నో అపోహలు నెలకొన్న సంగతి తెలిసిందే. అలాంటివాటిని దూది మాదిరి తేల్చేసే పుస్తకం 'అమరావతి: వివాదాలు.. వాస్తవాలు' పేరుతో బయటకు వచ్చింది. ఇందులో పేర్కొన్న పలు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఆయా అంశాల్ని సిం'ఫుల్' గా చెప్పుకొస్తే..
- శివరామ క్రష్ణణ్ కమిటీ నివేదికకు విరుద్ధంగా రాజధాని ఏర్పాటు చేశారు
కమిటీ తయారు చేసిన ఇండెక్స్ ప్రకారం మిగిలిన ప్రాంతాల కంటే కూడా విజయవాడ - గుంటూరు ప్రాంతమే అనువైనది. అస్పష్టంగా నివేదిక ఇచ్చిన శివరామక్రష్ణన్ కమిటీ.. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. కమిటీ సిఫార్సుల్ని సలహా మాత్రమే కానీ తప్పనిసరి కాదని పేర్కొంది. ఈ కారణంతోనే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ చేసిన వాదనను ఎన్జీటీ అందుకే కొట్టేసింది.
- రైతుల నుంచి భూముల్ని బలవంతంగా లాక్కున్నారా?
29 వేలకు పైగా రైతులు తమ భూముల్నిస్వచ్ఛందంగా ఇచ్చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి ఇంత మంది రైతులు భూములు ఇవ్వటాన్ని పరిశీలకులు అబ్బురంగా అభివర్ణిస్తారు. స్వామినాథన్ అయ్యర్ లాంటి ఆర్థిక వేత్తలు మాత్రమే కాదు.. ప్రపంచ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు సైతం అమరావతి నమూనాను అధ్యయనం చేశాయి అందుకే. భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కున్నారన్నఆరోపణల్ని అందుకే ఎన్జీటీ కొట్టేసింది.
- భూకంపాల జోన్ లో ఉంది.. డేంజర్ కదా?
జోన్ 3లో ఉంది కాబట్టి భూకంప ప్రమాదం తక్కువ. అత్యాధునిక భవన నిర్మాణ టెక్నాలజీ వాడితే భూకంప ప్రమాదం కనిష్ఠంగా ఉంటుదన్న ప్రభుత్వ వాదనతో ఎన్జీటీ ఓకే చేసింది.2021 ఫిబ్రవరిలో భూకంపం సంభవించినట్లుగా జగన్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో వార్త వస్తే.. ఆరోజున భూకంపం వచ్చినట్లుగా రాష్ట్రమే కాదు నాటి కేంద్రం కూడా అధికారికంగా ప్రకటించలేదు.
- అమరావతివి చిత్తడి నేతలు.. పర్యావరణానికి నష్టం
రాజధానిలో చెరువులు.. కుంటలు లాంటివి 616 ఎకరాల్లో ఉంటే.. మరో 1215 ఎకరాల్లో వాటిని విస్తరించాలన్నది నాటి ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల ఐదు కాలవల నిర్మాణంతో మరో 1410 ఎకరాల్లో గ్రీన్ బఫర్ జోన్ ఏర్పడుతుంది.
- తుపాను ముప్పు ఎక్కువ?
సముద్ర తీరానికి అమరావతి 60-80 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తుపాను తాకిడి ఉండే అవకాశం లేదని ఎన్జీటీ స్పష్టం చేసింది.
- పర్యావరణానికి దెబ్బేస్తుంది
రైతుల పట్ల వివక్ష.. ఈ ప్రాజెక్టుతో రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారన్న ఆరోపణతో శ్రీమన్నారాయణ అనే వ్యక్తి 2015లో సుప్రీంలో పిటీషన్ వేస్తే.. ఎన్టీజీటి వెళ్లకుండా తమను ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. దీంతో ఎన్జీటీకీ వెళ్లారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ.. ప్రస్తుతం జనసేనలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ అమరావతికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. వాటిని కొట్టేస్తూ 2016 సెప్టెంబరులో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- అమరావతి పనుల్లో విపరీతమైన ఆలస్యం?
అమరావతి పనుల ఆలస్యానికి అడుగడుగునా అడ్డుపడ్డ వారిని వదిలేసి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయటమా? ఏదో ఒక కారణాన్ని ఎత్తి చూపిస్తూ అయితే కోర్టు లేదంటే ఎన్జీటీని ఆశ్రయించటం.. ఆ ఆరోపణల్ని అవి కొట్టేయటం. మొత్తంగా కోర్టు పనుల కారణంగా ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. ఒక్క ఎన్జీటీకు చేసిన ఫిర్యాదులకే రెండేళ్లు సరిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.