Begin typing your search above and press return to search.

అమరావతి సాక్షిగా : చంద్రబాబు... పవన్...బీజేపీ ఒక్కటిగా...?

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:30 PM GMT
అమరావతి సాక్షిగా : చంద్రబాబు... పవన్...బీజేపీ ఒక్కటిగా...?
X
ఏపీలో రాజకీయం మారుతోంది. జగన్ కి యాంటీగా గొంతులు ఒక్కటి అవుతున్నాయి. బలమైన నాయకులు, పార్టీలు అంతా ఒక్క చోటకు చేరుతున్నారు. దానికి సరైన వేదికగా అమరావతి రాజధాని నిలుస్తోంది. ఒక విధంగా ఇది అధికార వైసీపీకి మింగుడు పడని వ్యవహారంగా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని ఆ పార్టీ వారు భావిస్తున్నారు. విపక్షాలు సైతం జగన్ బలమెంత అని తెలియకపోయినా డౌట్లు పెట్టుకోవద్దని అంతా ఒక్కటిగా ఉంటే సులువుగా ఓడిచగలమని భావిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కీలకమైన పార్టీలు అంతా ఒక్క త్రాటి పైన రావడానికి ఒక వేదిక అవసరం. అదే ఇపుడు అమరావతి అవుతోంది. అమరావతి ఏకిక రాజధానిగా కోరుతూ వెంకటపాలెంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13 నాటికి అమరావతి రాజధాని రైతుల పోరాటం మొదలెట్టి వేయి రోజులు అవుతోంది.అంటే ఇది కీలకమైన మైలు రాయి అన్న మాట.

దాంతో వెంకటపాలెంలో భారీ బహిరంగ సభను అమరావతి ఉద్యమకారులు నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వాఇంచారు. టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఇల అన్ని పార్టీలు నాడు ఒకే వేదిక మీదకు వస్తాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు పవన్ కలసి ఒకే వేదిక మీద కనిపించడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అంటే 2019 ఎన్నికల తరువాత ఎవరికి వారుగా ఉన్న పవన్ బాబు కలసి పాల్గొనే తొలి మీటింగ్ ఇదే అవుతుంది.

అమరావతి రాజధాని కోసం తెలుగుదేశం ఎటూ ముందు వరసలో ఉంది. దానికి జనసేన తరఫున పవన్ కూడా మద్దతు ఇచ్చారు. బీజేపీ సైతం ఏకైక రాజధాని అమరావతి అని అంటున్నారు. వామపక్షాలు కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నినాదం అమరావతి మాత్రమే రాజధాని అని. మొత్తానికి జగన్ కి యాంటీగా అంతా కలసి పూరిస్తున్న తొలి సమర శంఖారావం అని అంటున్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమకారులు అన్ని పార్టీల అధినాయకులను కలసి సభకు వారు వచ్చేలా హామీని పొందారని అంటున్నారు.

మరో వైపు చూస్తే మూడు రాజధానులతోనే వైసీపీ ఉంది. ఆ కల సాకారం కావడం కష్టసాధ్యమని తెలుస్తుందా కూడా ఎందుకో వైసీపీ అదే తన రాజకీయ దారి అంటోంది. ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళి అమరావతికి జై కొట్టినా వైసీపీకి ఏ రకమైన పొలిటికల్ క్రెడిట్ రాదు సరికదా విపక్షం గెలిచినట్లుగా ఉంటుంది. దాంతో వైసీపీ మూడు రాజధానుల పాట పాడాల్సిందే. మరి వైసీపీ అలా ఆ వైపున నిలుచుకుంటే మిగిలిన పార్టీలు ఈ వైపున ఉంటూ యనటీగా ఒక్కటిగా నినదిస్తాయి.

ఇక ఈ సభ ద్వారా చంద్రాబు పవన్ జనాలకు ఏమి పిలుపు ఇస్తారు అన్నది చూడాలి. అలాగే బీజేపీతో కనుక పొత్తు ఉంటే కచ్చితంగా 2014 ఎన్నికల పొత్తు రిపీట్ అవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు వైసీపీ యాంటీ కూటమి బలంగా ఏర్పడాలని అటు పవన్, ఇటు చంద్రబాబు కోరుకుంటున్నరు. దాంతో అమరావతి సాక్షిగా అంతా ఒక్కటి అయ్యేందుకు తొలి అడుగు పడుతుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సెప్టెంబెర్ 12 న జరిగే ఈ సభ ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుంది అని అంటున్నారు.