Begin typing your search above and press return to search.
నగర కార్పొరేషన్ గా ‘అమరావతి.. ఏపీ సర్కారు తాజా అడుగు
By: Tupaki Desk | 4 Jan 2022 2:30 AM GMTఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘అమరావతి’ విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం.. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు జరగటం.. ఈ మధ్యనే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి రైతులు పాదయాత్ర చేయటం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయపోరాటంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సర్కారు ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో19 గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చాలన్నది ప్రభుత్వ తాజా ఆలోచన. ఈ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. దీని పరిధిలోని గ్రామాల్లో గ్రామసభల్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ సభలకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సభల్లో గ్రామ ప్రజల అభిప్రాయసేకరణ చేపట్టనున్నారు. తుళ్లూరు మండలంలోని 16.. మంగళగిరి మండలంలోని మూడు గ్రామాల్లో గ్రామ సభల్ని నిర్వహిస్తారు. ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించి నోటిఫికేషన్ తర్వాతి దశలోకి అడుగు వేయనున్నారు. మరి.. ఈ గ్రామ సభలు ఏ రీతిలో జరుగుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. రాజధాని గ్రామాల ప్రజలు ఈ నోటిఫికేషన్ కు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.