Begin typing your search above and press return to search.

చెప్పులు విసిరించిన నీ మీదకే చెప్పులు విసరడం ఏంటయ్యా..?

By:  Tupaki Desk   |   28 Nov 2019 7:59 AM GMT
చెప్పులు విసిరించిన నీ మీదకే చెప్పులు విసరడం ఏంటయ్యా..?
X
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు మనమే గొప్ప అనుకోని ఇతరులపై బురదజల్లితే - మనపై కూడా బురదజల్లే వారు ఉంటారు అని మరచిపోవద్దు. మనల్ని కొట్టేవాడే లేడు అని ఇష్టం వచ్చిన రీతిలో ముందుకుపొతే అవమానానికి గురికావాల్సిందే. ఈ విషయం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కి ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. ఒకప్పుడు బాబు చేసిన పనే ఇప్పుడు బాబుకి ఎదురైంది ? అప్పట్లో స్వయానా పిల్లని ఇచ్చిన మామ - ఆంధప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు పై బాబు తన అనుచరులతో చెప్పుల దాడి చేయించారు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ , మనం చేసిన ప్రతీ పనికి ఆ దేవుడు సరైన సమయంలో సరైన సమాధానం చెప్తాడు అన్నట్టు ఆ రోజు మామ పై ఎలా చెప్పులు దాడి చేయించాడో ..ఈ రోజు అమరావతి పర్యటనలో బాబు పై అమరావతి ప్రాంత రైతులు చెప్పులతో దాడికి దిగారు. దీనితో చెప్పులు విసిరించిన నీ మీదకే చెప్పులు విసరడం ఏంటయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది బాబుకి సరైన న్యాయం జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు.

అసలు ఈ చెప్పుల దాడి ఎలా జరిగింది అంటే .. రాజకీయాలలో అపరచాణిక్యుడిగా తనకి తానుగా ప్రచారం చేసుకొనే చంద్రబాబు ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన లో ఓవైపు స్వాగతాలు - మరోవైపు నిరసనలతో రాజధాని ప్రాంతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ .. చంద్రబాబు గో బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. అక్రమంగా మా భూములని లాగేసుకొని మళ్లీ ఏ మొఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నావు అంటూ బాబు ని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వెంకటాయపాలెం దగ్గర టీడీపీ - వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు - రాళ్లు - కర్రలు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ ఉద్రిక్తత పరిస్థితుల మద్యే చంద్రబాబు అమరావతి పర్యటన కొనసాగుతోంది ..