Begin typing your search above and press return to search.

స్వాములోరిని అడ్డుకున్న అమరావతి మహిళలు

By:  Tupaki Desk   |   7 Feb 2020 10:45 AM GMT
స్వాములోరిని అడ్డుకున్న అమరావతి మహిళలు
X
ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు.. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన.. ఆందోళనలు చేపడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా నిత్యం ఇలాంటి పరిస్థితి అమరావతి ప్రాంతంలో నెలకొంది.

వరుస పెట్టి నిరసనలు నిర్వహిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి అమరావతి మహిళల చేతుల్లో నిరసన వ్యక్తమైంది. గుంటూరు శివారులో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్ని తాజాగా చేపట్టారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవటం కోసం వచ్చిన స్వాములోరిని అమరావతికి చెందిన మహిళలు అడ్డుకున్నారు.

కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో స్వాములోనికి ఊహించని పరిణామం ఎదురైంది. యాగాలు చేసి జగన్ ను గెలిపించిన స్వాములోరు.. అమరావతిని తిరిగి వచ్చేలా చేయాలన్నారు. అప్పట్లో అమరావతి వచ్చి యాగాలు చేసి జగన్ ను గెలిపించినట్లే.. అమరావతిలో రాజధాని కొనసాగించులా పూజలు చేయాలన్నారు. పెద్ద ఎత్తునవచ్చిన మహిళల కారణంతోఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే.. పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్న వేళ.. స్వాములోరు మాత్రం మారు మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తమకు జరిగిన అన్యాయం మీద న్యాయం అడగటానికి వస్తే పోలీసులతో నెట్టించేశారని కొందరు మహిళలు అడ్డుకుంటే మరొక మహిళానేత మాత్రం.. తమపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ఏమైనా..ఒక స్వాములోరి విషయంలో ఇలాంటివి చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.