Begin typing your search above and press return to search.

రాజధాని పై సినీ పెద్దలు స్పందించకపోతే థియేటర్లు బంద్!

By:  Tupaki Desk   |   3 Jan 2020 12:04 PM GMT
రాజధాని పై సినీ పెద్దలు స్పందించకపోతే  థియేటర్లు బంద్!
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. కర్నూల్ - విశాఖపట్నం - అమరావతి ..ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అని సీఎం జగన్ ప్రకటన - జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. గత రెండు వారాలకి పైగా రైతులు రోడ్ల మీదకు వచ్చి - తమ నిరసనని తెలియజేస్తున్నారు. దీనితో ఏపీ రాజధాని అంశం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కొనసాగుతోంది. దీనిపై ఎవరికీ తోచిన విధంగా వారు తమ స్పందనని తెలియజేస్తున్నారు.

ప్రతిపక్షం అయిన టీడీపీ రైతులకి మద్దతుగా నిలుస్తూ వారి ఆందోళనలో పాల్గొంటుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేసారు. అలాగే రాజధాని ప్రాంతంలో పర్యటించి ..అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ జగన్ సర్కార్ కి విజ్ఞప్తి చేసారు. ఇక కొందరు బీజేపీ నేతలు జగన్ కి జై కొత్తగా - మరికొంతమంది మాత్రం సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి.

కానీ , ఈ రాజధాని వ్యవహారం పై ష్ట్రంలో ఇంత జరుగుతున్నా టాలీవుడ్ స్పందించడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ మండిపడుతోంది. . సినీ ప్రముఖుల మౌనం రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. హీరోలు రాష్ట్ర రాజధానిపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు లేఖలో తెలిపారు. ప్రజల టికెట్లతో వందల కోట్లు సంపాదించుకున్న సినీ పెద్దలు.. అదే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తోంది. ఈ నెల 10లోగా సినీ ప్రముఖులు స్పందించకపోతే.. సంక్రాంతి పండుగ 3 రోజులూ థియేటర్ల బంద్‌కు పిలుపునిస్తామని అల్టిమేటం జారీ చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలు. కాగా , ఈ రాజధానుల వ్యవహారం పై ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి ఒక్క మెగాస్టార్ మాత్రమే తన అభిప్రాయాన్ని తెలియజేసారు. మెగాస్టార్ తప్ప ..మిగిలిన ఏ హీరో కూడా దీనిపై స్పందించలేదు. ఇకపోతే ప్రస్తుతం సినీపరిశ్రమలో మా వివాదం కొనసాగుతుంది . మా లో ఉన్న ఘర్షణలు రచ్చగా మారుతున్న సమయంలో ఏపీ రాజధాని అంశంపై సినీ ప్రముఖులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి ...